ఆరోగ్యాన్ని మేలుచేసే ఆహారాల్లో ఉసిరికాయ ఒకటి. ఇందులో వుండే ఔషధగుణాలు రకరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు నిత్యం ఆరోగ్యంగా మెలిగేందుకు సహాపడుతాయని ఆరోగ్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా స్పష్టం చేస్తున్నారు. యాంటీ-బ్యాక్టీరియా లక్షణాలను కలిగివున్న ఉసిరి పొడిని రోజుకు అరస్పూన్ తీసుకుంటే.. వ్యాధినిరోధక శక్తి పెరగుతుందని అంటున్నారు. దాంతో.. రోజంతా ఎంతో ఉత్సాహంగా వుంటూ అన్ని కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనవచ్చునని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ ఉసిరిలో వుండే విటమిన్లు ముఖానికి మరింత అందాన్ని చేకూరించి.. నిత్య యవ్వనులుగా వుండేలా ప్రేరేపిస్తుందని బ్యూటీషియన్లు వెల్లడిస్తున్నారు.
ఉసిరికాయలో విటమిన్-సి, క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, విటమిన్-బి కాంప్లెక్స్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవి నీరసం, అలసటను తగ్గించడంలో ప్రధానపాత్రను పోషిస్తాయి. అంతేకాకుండా ఉసిరికాయ జ్యూస్ తీసుకుంటే అలసత్వానికి చెక్ పెట్టవచ్చు. అయితే శరీరానికి ఇది చలవ చేయడం వల్ల వర్షాకాలంలో కాస్త తక్కువ మోతాదులో వీటిని తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. ఉసిరి శిరోజాల సంరక్షణలో మెరుగ్గా పనిచేస్తుంది. అందుకే ప్రస్తుత హెయిల్ ఆయిల్ బ్రాండ్లలో ఉసిరికాయ కీలక పాత్ర పోషిస్తోంది. ఎసిడిటీ, జీర్ణ సంబంధిత వ్యాధులకు రోజువారీగా ఉసిరికాయ పొడిని లేదా జ్యూస్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఉసిరికాయ గుండెకు ఎంతో మేలుచేస్తుంది. హృదయ కండరాలను పటిష్టం చేస్తుంది. రక్తంలోని హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. మన శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, వ్యాధులను దరిచేరనివ్వదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అయితే.. ఈ ఉసిరిని మోతాదుకు మించి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు వీటిని తక్కువ పరిమాణంలో సమయానుకూలంగా తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని సచిస్తున్నారు. వేసవిలో అధికంగాను, వర్షాకాలంలో చాలా తక్కువ మోతాదులో ఉసిరిని తీసుకోవాలని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more