కప్‌కేక్.. డూనట్.. ఎక్లెయిర్.. ఫ్రోయో...జింజర్‌బ్రెడ్.. హనీకూంబ్.. ఐస్‌క్రీమ్ శాండ్విచ్.. జెల్లీబీన్.. కిట్‌క్యాట్ ఇలా సంవత్సరాల గడిచే కొద్ది కొత్తకొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వర్షన్‌లు మారుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఊరిస్తూ లెక్కకు మిక్కిలి అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి.కంప్యూటర్ తరహాలో స్మార్ట్‌ఫోన్‌లోనూ రకరకాల అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంటాం. అయితే, పలు సందర్భాల్లో ఈ యాప్స్ కారణంగానే ఫోన్ ప్రాసెసింగ్ వేగం మందగిస్తుంది. అందుకే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసి ఉన్న యాప్స్ ఎప్పటిక్పుడు పర్యవేక్షిస్తూ నిరుపయోగంగా మారిన వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయటం మంచిది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న అడ్వాన్సుడ్ టాస్క్ మేనేజర్ యాప్ మొబైల్ ప్రాసెసింగ్‌ను పర్యవేక్షింటంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
ఎప్పుడైన మొబైల్ ప్రాసెసింగ్ తగ్గినట్ల అనిపిస్తే ఈ యాప్‌ను ఆశ్రయిస్తే చాలు, మొబైల్ బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్స్ జాబితాను చూపిస్తుంది. వాటిలో అవసరంలేని వాటిని క్లోజ్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో మల్టీటాస్కింగ్ చేస్తున్నట్లయితే, ర్యామ్ పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి, ర్యామ్ వాడకాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న అన్ని యాప్స్‌కు ర్యామ్ అవసరం ఉంటుంది. ఒకేసారి రకరకాల యాప్స్‌ను వినియోగిస్తున్నట్లయితే ర్యామ్ వేగం మందగించి మొబైల్ ప్రాసెసింగ్ నత్తనడకన సాగుతుంది. ర్యామ్‌ను పొదుపుగా వాడుకునేందుకు రకరకాల యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో క్లీన్ మాస్టర్ ఒకటి. ఈ ప్రత్యేకమైన యాప్ రన్ అవుతున్న యాప్స్‌ను కిల్ చేయటంతో పాటు బ్రౌజర్‌లోని డేటా, హిస్టరీ ఇంకా క్యాచీలను తొలగించి, ర్యామ్ ఖాళీని పెంచుతుంది.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more