కొత్తగా సినీ రంగంలోకి అడుగుడి తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలనుకుంటున్న కళా తపస్వి కొండంత అభయమిచ్చారు. కళపై తపన ఉండే యువ దర్శకులను నేటి చిత్రసీమకు అందిస్తానని ప్రముఖ సినీ దర్శకులు కె.విశ్వనాథ్ అన్నారు. విజయవాడలో మహానటి సావిత్రి కళాపీఠం, నాట్యాచార్య పవన్ బృందం సంయుక్తంగా నిర్వహించిన మహానటి సావిత్రి 76వ జయంతి వేడుకల్లో విశ్వనాధ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్‌ను మహాదర్శకుడు, చిన్నారి గాయని గజల్ సంస్కృతికి 'గజల్ గాన సుధామయి' అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా విశ్వనాధ్ చాలా విషయాలు వెల్లడించారు. తాను మెప్పు కోసం సినిమాలు తీయనని చెప్పారు. నేడు సందేశాత్మకమైన సినిమాలు తక్కువగా వస్తున్నాయని, ఆశ్లీలత భాగా శృతిమించడాన్ని ఆయన వ్యతిరేకించారు. నాట్యం పంచమ వేదమని, ఘంటసాల పవన్, శిష్యులను తయారు చేయటంలో ఎంతో పురోగతి సాధించాడని కొనియాడారు. తను నాట్యంలో చేసిన కృషి ఒక మంచి సినిమాగా రూపొందించవచ్చునన్నారు. నాట్యాన్ని నేర్పించటంలో తల్లి దండ్రుల ప్రోత్సాహం ఉంటేనే అందులో సంపూర్ణత సాధించవచ్చన్నారు.
అహోబిలం పీఠాధిపతి జీయర్ స్వామి మాట్లాడుతూ సముద్రంలో లభించే స్వాతి ముత్యం అని కొనియాడారు. చక్కని సినిమాలు తీసే అరుదైన దర్శకుల్లో విశ్వనాథ్ ఒకరన్నారు. నేటి చిన్నారులకు విద్యార్థి దశ నుంచే సంస్కృతి సంప్రదాయాలు, ఆధ్యాత్మిక, భక్తి చింతనలపై ఆసక్తి పెంచాలన్నారు.
మారిషన్ పీఠాధిపతి బృందావనం పార్థసారథి మాట్లాడుతూ చిన్నారుల్లో ఆధ్యాత్మిక విషయాన్ని ఎలా పెంపొందించాలో వివరించారు. త్వరలో మారిషస్ పీఠం నుంచి కె.విశ్వనాథ్‌కు ఉగాది పురస్కారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
సాంస్క్రుతిక కార్యక్రమాల్లో భాగంగా 250 మంది విద్యార్థుల నృత్య విన్యాసాలు.. ఘంటసాల పవన్ కుమార్ శిష్య బృందం 250 మంది చిన్నారులతో చేసిన 10 రకాల నృత్యాంశాలు ప్రేక్షకులకు కళావిందు నందించాయి.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more