We revolt on high command for united ap lagadapati

we revolt on high command for united ap lagadapati, Lagadapati Rajagopal, vijayawada mp lagadapati rajagopal , congress party, samaikyandhra movement,

we revolt on high command for united ap lagadapati

తిరగబడతాం: లగడపాటి

Posted: 10/19/2013 08:32 PM IST
We revolt on high command for united ap lagadapati

రాష్ట్రాన్ని విభజిస్తే పదవులు సైతం వదులుకొని అధిష్టానంపై తిరగబడతామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రయత్నించిన కొన్ని పార్టీలు చేతకాని తనం వల్లే రాష్ట్రం విడిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. అటువంటి పార్టీలను బండ కేసి కొట్టాలని మండిపడ్డారు.

 

రాష్ట్ర విభజన ఏర్పాటు దిశగా లేఖలు ఇవ్వద్దని పార్టీలను వేడుకున్నామని లగడపాటి తెలిపారు. రాజకీయ పార్టీలను ప్రజలు ద్వేషిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పటానికి ఎదురు చూస్తున్నారనిఅన్నారు. రాజకీయ పార్టీల అధినేతలు ఈ విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. లగడపాటి రాజగోపాల్ రాజీనామాను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించిన విషయం తెలిసిందే.

 

ఏపీఎన్జీవోలు, ఇతర సంఘాల నేతల సమ్మె విరమణతో సమైక్య ఉద్యమం సమసిపోయిందనుకోవడం పొరపాటు అని అన్నారు. గ్రామస్థాయి నుంచి ఉద్యమ ఉధృతికి సీఎం యత్నిస్తున్నారని తెలిపారు. ఉద్యమాల్లో స్వయంగా పాల్గొన్న సీఎంగా కిరణ్ చరిత్ర సృష్టిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాజ్యంగ సవరణ చేస్తే తప్ప రాష్ట్ర విభజనకు అవకాశాలు లేవని రాజగోపాల్ స్పష్టం చేశారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more