ప్రేమలో రంగుల కలలుంటాయి. రమ్యమైన ఊహాలుంటాయి. వైవాహిక జీవితంలో అవి సాకారం కావాలంటే... భార్య భర్తల మనసునమనసై అన్నట్లు మెలగాలి. ఆంక్షల కన్నా, అర్థం చేసుకునే తత్వానికి ప్రాధాన్యమివ్వాలి. ప్రేమ అంతర్యమూ అదే... ఐఐఎంలో చదువుకొని, ఉన్నత కొలువుని వదులుకొని... రచనలు చేస్తానన్న భాగస్వామిని ప్రోత్సహించి... భారత్ లో బెస్ట్ సెల్లర్ రచయితగా ఎదిగేందుకు కారణమయ్యారామె. యువత మెచ్చిన రచయిత చేతన్ భగత్. అతని అర్థాంగి బ్యాంక్ సీఓఓ అనూషతో ప్రేమికుల రోజు స్పెషల్.
ఐఐఎంలో చదువు.... హాంకాంగ్ లో కొలువు... తలుచుకుంటే.. బ్రహ్మాండమైన జీతంతో దూసుకుపోగల సత్తా ఉంది కానీ....‘నేను ఇంట్లో ఉంటా... పుస్తకాలు రాస్తా...’ అన్నప్పుడు ఆమె ఖంగు తినలేదు. పోట్లాట పెట్టుకోలేదు. ‘మీ పై నమ్మకం ఉంది’. అంటూ సీఓఓగా ఓ ప్రక్క బాధ్యతలు స్వీకరిస్తూనే ఇంటి బాధ్యతలు కూడా స్వీకరించింది. నా విజయానికి పునాదులు వేసింది. అనూష వ్యక్తిత్వానికి అది ఓ మచ్చుతునక...
నాది ఉత్తరం... ఆమె దక్షిణం.... : మా ప్రేమ గురించి చెప్పాలంటే... అది పెద్ద కథ అంటారు. అనూష చాలా తెలివైనది. కానీ పట్టింపులు, సంప్రదాయం నడుమ పెరిగిన తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. నాది అందుకు భిన్నమైన నేపథ్యం. పంజాబీ అమ్మాయిని. మా ఇద్దరినీ కలిసింది అహ్మదాబాద్ ఐఐఎం ప్రాంగణం. మేం నమ్మిన భావాలు ఒకటే కావడంతో ప్రాంతీయ భేదాలు అడ్డుపడలేదు. ప్రాణ స్నేహితులమయ్యాం. ఆ స్నేహాన్ని ప్రేమగా మలచుకున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఏడడుగులు వేద్దాం అనుకునే సమయానికి ఒక్కొక్కటిగా ఆటంకాలు. ప్రేమించుకోవడానికి లేని అవధులు పెళ్ళనే సరికి ఎదురొచ్చాయి. ఇతర దేశాల్లో అబ్బాయి అమ్మాయి అభిప్రాయాలు కలిస్తే చాలు. మంగళవాద్యాలు మోగుతాయి. ఇక్కడ అలాకాదుగా... ఇరు కుంటుంబాల ఇష్టా ఇష్టాలు ఒక్కటవ్వాలి. ఆమె పెద్దలని ఒప్పించడానికి చాలా శ్రమ పడ్డా. దానినీ ప్రేమలో భాగం అనుకొనే స్వీకరించా. ఎలాగైతేనేం ఇద్దరినీ ఇప్పించి మేం 1999లో వివాహం చేసుకున్నాం.
నమ్మకమే జీవితం: పెళ్ళి తర్వాత హాంకాంగ్ లో కాపురం. ఇద్దరు పిల్లలు. పదకొండేళ్ళ పాటు నేను అనూష బ్యాంకు ఉద్యోగం చేసుకున్నాం. ఇద్దరికీ క్షణం తీరిక లేదు. అయినా కలిసి ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళం. ఉద్యోగ రంగంలో మెరిసేందుకు కష్టపడేవాళ్ళం. స్వతహాగా నాకు కథలు రాయడం, పుస్తకాలు రాయడం చదవడం అంటే ఆసక్తి. వారాంతాల్లో తీరిక దొరికనప్పుడు నా అభిరుచికి మెరుగులు దిద్దుకునే వాడిని. అది క్రమంగా బలమైక కోరికగా మారింది. ఓ ప్రక్క ఉద్యోగ బాధ్యతలు , మరో ప్రక్క రచనా వ్యాసంగం. నా పుస్తకాలకు పాఠకాదరణ పెరిగింది. దాంతో బాధ్యతలు, ఒత్తిడి పెరిగాయి. ఉద్యోగం వదిలి పెడితే కానీ రచనలు చేయలేని పరిస్థితి. ఆ సమయంలో అనూష ఇచ్చిన ప్రేరణ మాటల్లో చెప్పలేనిది. తను నాకు అండగా నిలిచింది. తనకి విదేశాల్లో చక్కని కెరీర్ ఉన్నా... నా కోసం వదులుకొంది. వాస్తవానికి నా కెరీర్ లో ఇప్పటికీ చెప్పుకోదగ్గ విజయాల్లేవు. అయినా తను నన్ను నమ్మి తీసుకున్న నిర్ణయమే నన్ను విజయతీరాలకు చేర్చింది.
ప్రేమకు జిందాబాద్. పలకడం తేలికే. కానీ పెద్దలను ఒప్పించి, వివాహ బంధంతో ఒక్కటవ్వడం ప్రేమను చిరకాలం నిలబెట్టకోవడం అంత సులువుకాదు. ఆ విషయంలో మేం విజయం సాధించామనే చెప్పాలి. ఆయన సహ విద్యార్థిగా ఉన్నప్పుడు ఎంత ప్రేమించానో, ఉన్నతోద్యోగం వదిలి రచయితగా మారతానన్నప్పుడు కూడా అంతే నమ్మకాన్ని, సంయమనాన్ని పాటించాను. అందుకే ఈ మధ్య ఉన్న అనుబంధమే కారణం.
మనసు ఒక్కటే... మా పెళ్ళికి పెద్దలు సరేమిరా అన్నారు. ప్రధాన కారణం మేం తమిళలం. ఆయన పంజాబీ. నా కుటుంబ సభ్యలను ఒప్పించి పెళ్ళి చేసుకోవడానికి ఆయన చాలా శ్రమపడ్డారు. ఆ మాటకొస్తే నేను కూడా చొరవ తీసుకొని పెద్దవాళ్లని ఒప్పించాను. ఎలా అయితేనేం. మేం పెళ్ళితో ఒక్కటయ్యాం. మా పెళ్లి కష్టాలని ఆయన ‘‘ 2 స్టేట్ మెంట్స్’’లో చాలా చక్కగా రాశారు. మాకు కలవల పిల్లలు. ఇషాన్, శ్యామ్. మాకెదురైన ఆటంకాలు.. మా పిల్లలకు ఏర్పడదనుకున్నాం. అందుకే మీదే రాష్ట్రం అని అడిగితే భారత్ అని చెప్పమన్నాం.
ఆయన పిల్లల కోసం.... రచన, ఉద్యోగం... ఏది మేలు అని ఆయన సతమతమౌవున్న సమయంలో ఆయనకు తోడుగా నిలవాలనిపించింది. అదే సమయంలో పిల్లల్ని మన సంప్రదాయాలకు అనుగుణంగా, చక్కటి విలువలను మేళవించి పెంచాలనిపించింది. అందుకే విదేశాల్లో కెరీర్ కి స్వస్తి చెప్పాను. ఇద్దరం ఒకే మాట పై ఉండి... 2008లో ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యాం. ఆ తర్వాత ముంబయిలో బ్యాంకు సీఓఓగా స్థిరపడితే... ఆయన ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్, వన్ నైట్ ఎట్ ద కాల్ సెంటర్’ ది త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ పుస్తకాలతో ఆదరణ పొందారు. అభిరుచులకు పట్టం కట్టాలన్న మా నిర్ణయం సరైందేనని సంతోషపడ్డా.
ముందు చూపున్న మనిషి.... చేతన్ చాలా నిడారంబరంగా ఉంటారు. ఏ మాత్రం తీరిక దొరికినా.... పిల్లలతో గడుపుతారు. నేను ఇంట్లో లేకపోతే పిల్లల బాధ్యత ఆయనదే. చక్కని భవిష్యత్తు ఉన్న ఉద్యోగాన్ని వదిలి పుస్తకాలు రాస్తానన్నప్పుడు మొదట మదిలో చిన్న ఆందోళన. కానీ ఆయన ముందుచూపు పై నాకు అపార నమ్మకం. ఆయన తన బ్లాగులు, సంపాదకీయాల్లో రాజకీయ నేతలపై వేసే వ్యంగాస్ర్తా గురించి చాలా మంది ప్రస్తావిస్తుంటారు. నేను పెద్దగా పట్టించుకోను. కానీ వ్యక్తిగత విమర్శలు వద్దని సూచిస్తుంటాను. సమాజంలో మంచి మార్పుకోసం ఆయన పడే తపన మాత్రం చాలా ఆకట్టుకుంటుంది.
ఒత్తిడి లోనూ ఒయసిస్సులా.... ఇద్దరం ఉద్యోగాలతో పిల్లలకు సరైన సమయం కేటాయించలేకపోయాం. అందుకే ఇప్పుడు ఎంత ఒత్తిడి ఉన్నా మేమంతా కలిసి సరదాగా బయటకు వెళ్తాం. ఆటలంటే మా పిల్లలకి ఇష్టమే. మేం భవిష్యత్తులో స్పోర్ట్స్ మెన్ అవుతాం అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more