తెలుగు సినీ పరిశ్రమలో నటీమణులకు కొదవే లేదు ... నేడు హీరోయిన్ అంటే గ్లామర్ కు మారు పేరు అన్న నానుడి ఉన్నా కూడా , తమన్నా నుండి సమంత , నిత్యా మీనన్ వంటి ఎందరో హీరోయిన్లు , బాలీవుడ్ లో విద్యా బాలన్ , కరీనా కపూర్ వంటి హీరోయిన్లు తమదైన శైలి లో పాత్రల ఎంపిక చేసుకుంటూ , అటు గ్లామర్ ఇటు నటన , రెండింటినీ సమన్వయ పరచుకుంటున్నారు ... అయితే తెలుగు సినిమా లో హీరోయిన్ కు ఐటం భామ కు ఎంతో వ్యత్యాసం తమ కధల్లో చూబించే దర్శకులు సినిమాలని నిర్దేశించే దశలో , అటు హీరోయిన్ గా , ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టు గా కొనసాగిన , 'సహజ' నటీమణి సుజాత .
'నిజ జీవితం లో ఇల్లాలి పాత్ర పోషించడం మొదలు పెడితే ఇక వెండి తెర మీద హీరోయిన్ గా కనిపించే అవకాశానికి స్వస్తి చెప్పాల్సిందే' అనే ఆలోచన తప్పు అని ఈ మధ్యనే మరో సారి నిరూపించారు , కరీనా విద్యా వంటి హీరోయిన్లు ... అయితే ఈ ప్రక్రియ లో హిందీ పరిశ్రమ విజయం సాధించినా , తెలుగు చిత్ర సీమ మాత్రం హీరోయిన్ కి నిజ జీవితం లో పెళ్లి జరిగితే , తెర మీద అవివాహిత గా చూబించడానికి ఇంకా జంకుతోంది ... కాని గోల్డెన్ ఎరా లో షావుకారు జానకి , సావిత్రి వంటి నటీమణుల దగ్గరి నుండి తరువాతి తరం లో సుజాత వంటి నటీమణుల వరకు నిజ జీవితానికి , వెండి తెరలో తమ పాత్రలకు ఏ మాత్రం పొంతన ఉండనవసరం లేదని చెప్పకనే చెప్పారు ...
గోరింటాకు చిత్రం లో మానసిక పరిపక్వత చెందిన డాక్టర్ పాత్రలో మెప్పించినా , తరువాత కొంత కాలానికి చంటి చిత్రం లో తన కొడుకే సర్వస్వం గా బ్రతికే తల్లి పాత్రలో అలరించినా అది సుజాత గారికే చెల్లింది ... అప్పటి తరం స్టార్ హీరో ఏ . యన్ . ఆర్. వంటి వారితో నటించినా , తాను చేసిన ప్రతీ చిత్రం, కధా , కధనం , హీరో తో సంబంధం లేకుండా , అన్ని చిత్రాలలో తన పాత్ర ఆ చిత్రానికి కీలకం అయ్యే దిశగా పాత్రల ఎంపిక చేసుకున్న సుజాత గారి ఆలోచనా విధానం , తన పరిణతి చెందిన ఆలోచనా విధానానికి చక్కని ఉదాహరణ ...
కేవలం తెలుగు చిత్ర సీమలోనే కాక , తమిళం మలయాళం చిత్ర పరిశ్రమలో కూడా , నేటికీ సుజాత గారు భౌతికంగా జీవించి లేకపోయినా , తన నటన ద్వారా సినిమాల ద్వారా చిరస్మరణీయం అని చెప్పచ్చు ... ఒద్దిక , అణుకువ , సంత స్వభావం , స్త్రీ జీవితాన్ని ఆవిష్కరించే పాత్రలు , ఈ తరహా పాత్రల్లో నటించడం కాదు , తన నటన ద్వారా ఆ పాత్రలకు ప్రాణం పోయాలీ అంటే అది కేవలం సుజాత గారికే సాధ్యం ...
తన కరియర్ మొదట్లో పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి అంతగా గుర్తింపు లేని పాత్రలు పోషించిన సుజాత , క్రమేపి తనకంటూ ఒక ఇమేజ్ ని సృష్టించుకుని , దీనికే కట్టుబడి పాత్రల ఎంపిక చేసుకోవడం విశేషం ... ముఖ్యంగా తెలుగు లో సుజాత పోషించిన పాత్రలు కోకోల్లలే అయినా , 'ఏడంతస్తుల మెడ' చిత్రం లో పేదవాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జమిందార్ కూతురు , పరిస్తితులకి అనుగుణంగా తనని తాను ఎలా సమన్వయ పరచుకుంటుంది అని అద్భుతంగా ఈ పాత్ర తీరు తెన్నులని తన నటన ద్వారా ఆవిష్కరించారు సుజాత . ఈ చిత్రం లో హీరో ఏ . యన్ . ఆర్. కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది సుజాత నటన ...
అప్పటి అగ్ర కధానాయకులందరి సరసన నటించిన అనుభవం సుజాత గారి సొంతం ... ఆకర్షణీయమైన రూపం , ఆకట్టుకునే మాట తీరు , సుజాత సొంతం ... ఇవి ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకునేవి కూడా ...
తాను నటించిన అన్ని భాషల్లో తన పాత్రలకు తానే గాత్ర దానం చేసి , పరిపూర్ణ నటి అనిపించుకున్నారు సుజాత ... ఈ తిరుగులేని నటీమణి , తన నిజ జీవితంతో సంబంధం లేకుండా , నటన లో విజయం సాధించాలి అనుకునే ప్రతీ మహిళకీ ఆదర్శప్రాయం ... అందుకే భౌతికంగా 55 ఏళ్ళ వయస్సులోనే ఈ నటి మనకు దూరం అయినా , నేటికీ 'యశోధర' రూపంలో మనం ఈమెను గుర్తు చేసుకుంటూనే ఉంటాం ...
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more