మన భారతదేశంలో మహిళలకు కనీస మర్యాద కూడా లభించని కాలంలో ఎందరో ప్రతిభావంతులు వెలిశారు. మహిళలకు కూడా సమాజంలో మగవారికి లభిస్తున్న సమాన హక్కు కల్పించాలని తమ గళం విప్పారు. ఎన్నో మహిళా ఉద్యమాలను నిర్వహించారు. సాటి మహిళ బాధను తెలుసుకుని, వారికి కావలసిన అన్ని అవసరాలను తీర్చాల్సిందిగా డిమాండ్లు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచారు. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ, విజయాలబాటవైపు నడిచి ప్రథములు మన భారతదేశంలో ఎందరో జన్మించారు. అందులో ఒకరే విజయ లక్ష్మీ పండిట్.
మన సుప్రిసిద్ధమైన భారతదేశంలో రాజకీయ, దౌత్యవేత్తగా పేరుగాంచిన విజయలక్ష్మీ పండిట్ అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. బ్రిటీష్ పరిపాలనాకాలంలో స్వాతంత్ర్యం కోసం నిర్విరామంగా పోరాడి, కారాగారాలను సైతం లెక్కచేయకుండా తన ప్రాణాలనైనా త్యాగం చేయడానికి సిద్ధపడిన వీరవనితలందరిలో ఈమె ఒకరు. మన భారతదేశంలో మంత్రి పదవి పొందిన మొదటి భారతీయ మహిళగా ఈమె చరిత్రను సృష్టించారు. ఆ తరువాత 1962 నుంచి 1964 వరకు మహారాష్ట్ర గవర్నరుగా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు.
1900 ఆగస్టు 18వ తేదీన మోతీలాల్ నెహ్రూ, స్వరూపారాణి నెహ్రూ దంపతులకు విజయలక్ష్మీ పండిట్ జన్మించారు. జవహర్ లాల్ నెహ్రూ సోదరుడు. విజయలక్ష్మీ చిన్నతనం నుంచి స్వరూపారాణిగా పిలువబడుతుండేది. తండ్రి మోతీలాల్ నెహ్రూ లాయర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందడంతోపాటు బాగా ధనాన్ని కూడబెట్టుకున్న వ్యక్తి. వీరిది సంపన్నమైన కుటుంబం కావడంతో అధునాతనమైన భవనంలో నివసించేవారు.
మోతీలాల్ కు చిన్నతనం నుంచే విదేశీ నాగరికత, వారి ఆచార వ్యవహారాలంటే చాలా ఇష్టం. ఇంట్లో వున్న పిల్లలకు చదువు చెప్పేందుకు ఆంగ్లేయ వనితలే వుండేవారు. అందువల్లే జవహర్ లాల్ నెహ్రూ, విజయలక్ష్మీ పండిట్ లు చిన్నతనం నుంచే పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడిపోయారు. విజయలక్ష్మీ చిన్నతనంనుంచే విదేశీ క్రమశిక్షణలకు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు మధ్య హుందాగా పెరిగారు. స్వరూపకుమారికి అసలు పాఠశాల విద్య అంటే ఏమిటో తెలియదు.
స్వరూప కుమారి ఆమె సోదరి కృష్ణ లకు కవిత్వమంటే మంచి ఆశక్తి. వారిద్దరూ ఎక్కువ కాలం వారి తోటలో కూర్చుని సాయంకాల సమయాలలో కవిత్వ ప్రసంగాలతో కాలము వెళ్ళబుచ్చేవారు. స్వరూప కుమారి పదిహేడవ ఏట ఆమె సంరక్షకురాలైన ఆంగ్ల వనిత వెళ్ళిపోయింది. సోదరి కృష్ణకు ఆమె అన్ని విధాల చేదోడుగా ఉంటూ, పది సంవత్సరాల కృష్ణకు ఆమె ఎంతో విజ్ఞానాన్ని బోధిస్తూ ఆమెను విపరీతంగా ప్రేమించింది.
స్వరూపకుమారి (విజయలక్ష్మీ పండిట్) తన 5 సంవత్సరాల వయస్సులో అంటే 1905, మే నెలలో మోతీలాల్ తన కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారు. జవహర్ లాల్ లండన్ హోరో విశ్వవిద్యాలయంలో చేరగా... అతనికి అన్ని ఏర్పాటు సమకూర్చుకుని మోతీలాల్ తన భార్యపిల్లలతో కలిసి ప్రపంచయాత్రకు వెళ్లాడు. అయితే వీరు తిరిగి ఇండియాకు రాగానే ఇండియాలో రాజకీయ కల్లోలం తయారయిపోయింది. రోజురోజుకు బ్రిటీష్ పాలకుల దురాగతాలు, అత్యాచారాలు చాలా ఎక్కువయిపోయాయి. భారతీయుల స్వేచ్ఛకు ఎక్కువ భంగం కలిగింది.
దీంతో ఆగ్రహానికి గురయిన మోతీలాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పరిచయాలు పెంచుకున్నారు. 1915లో కాంగ్రెస్ మహాసభలు, ముస్లీం లీగ్ సభలు ముంబయిలో జరిగాయి. మోతీలాల్ తోపాటు విజయలక్ష్మీ కూడా ఈ రెండు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆమెకు రాజకీయాలమీద అంతగా అవగాహన లేకపోవడంతో దేశ సమస్యలు అర్థమయ్యేవి కావు. అయినా ఆమె దేశ పరిస్థితులు, ఉద్యమ విధానాల గురించి తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా వుండేది.
తరువాత విజయలక్ష్మీ పండిట్ వివాహం కథియావార్ లో వుండే రంజిత్ పండిట్ అనే న్యాయవాదితో 1921 మే 10వ తేదీ జరిగింది. వీరి వివాహానికి గాంధీజీతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వారందరూ హాజరయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఓవైపు విజయలక్ష్మీ వివాహం... మరోవైపు వర్కింగ్ కమిటీ సమావేశాలతో అలహాబాద్ మొత్తం కళకళలాడింది. ఈ ఇద్దరి దంపతులకు చంద్రలేఖ, నయనతార, రీటా అనే ముగ్గురు కుమార్తెలు కలిగారు.
విజయలక్ష్మీ రాజకీయ ప్రస్థానం :
1940 మార్చి 30వ తేదీన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ఇందులో జవహర్ లాల్ నెహ్రూ, విజయలక్ష్మీ పండిట్ లు పాల్గొన్నారు. అయితే ఏప్రిల్ 14వ తేదీన జవహర్ లాల్ అరెస్టయ్యాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న విజయలక్ష్మీ ఉత్సాహంగా ఉపన్యాసాలు ఇచ్చింది.ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ, ఉత్సరాలూ, ఊరేగింపులూ జరిపింది. అన్ని రకాలుగా ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఎన్నో రకాలుగా ప్రభుత్వం చేత మోసగింపబడే భారతీయులకు తను చేతనైన సహాయం చేయడం ఒక భారత మహిళగా తన కర్తవ్యమని భావించిన విజయలక్ష్మీ పండిట్ ప్రభుత్వాజ్ఞలను గూడా ధిక్కరించి ఉద్యమ ప్రచారం చేసింది.
విజయలక్ష్మీ పండిట్ కు సభలూ, సమావేశాల్లోనూ పాల్గొనకూడదని ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఒక రోజు అలహాబాద్ లో జరిగిన బహిరంగ సభలో స్వరూపరాణి ఉపన్యసిస్తుంటే, ప్రభుత్వం లాఠీ చార్జీ అరెస్టులు జరిపించింది. విజయలక్ష్మీ పండిట్ ను అక్కడ అరెస్టు చేస్తే, ఉద్యమం తీవ్రమౌతుందని భావించిన ప్రభుత్వం... మరుసటి రోజు ఉదయం ఆనందభవన్ వద్ద ఆమెను,ఆమె సోదరి కృష్ణనూ అరెస్టు చేశారు. అయినా వారి అరెస్టులను వారుగానీ, వారి కుటుంబ సభ్యులు గానీ ఏ మాత్రం విచారించలేదు. దేశం కోసం జైలుకు వెళ్ళడం చాలా ఘనతగా ఊహించారు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కోర్టు విచారన తర్వాత చెరొక సంవత్సరం జైలు శిక్షను లక్నో జైలులో అనుభవించారు. సంవత్సరం గడిచాక వారు విడుదల చేయబడ్డారు.
తొలి మంత్రిగా :
ఎన్నికలద్వారా ప్రజాభిప్రాయాలను తెలుసుకుని శాసన సభలలో ప్రవేశించేందుకు కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది. జవహర్ లాల్ నెహ్రూ వంటి ప్రముఖులు, నిద్రా హారాలు లేకుండా ఎన్నికల ప్రచారం చేసిన పలితంగా మొత్తం పదకొండు రాష్ట్రాలలో పోటీ చేస్తే.. ఏడు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. విజయలక్ష్మీ పండిట్ కాన్పూర్ చిల్హర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ప్రత్యర్థి పైన వెయ్యి ఓట్ల మెజారిటీ తో గెలిచారు.
విజయలక్ష్మీ పండిట్ తొలిసారిగా మంత్రిణిగా పదవీ స్వీకారం చేసి స్థానిక స్వపరిపాలనా బాధ్యత చేపట్టింది. 1937 జూలై 28న ఆమె ప్రమాణ స్వీకారం చేసింది. అసెంబ్లీ లో గోవింద వల్లభ పంత్ ప్రవేశపెట్టిన స్వపరిపాలనా ప్రథమ తీర్మానం, ఆయనకు అనారోగ్యంగా ఉండటం వల్ల విజయలక్ష్మీ పండిట్ ఆ బాధ్యతను స్వీకరించింది. వయోజన ఓటింగ్ పద్ధతిని ఎన్నుకోబడిన ప్రజా నాయకులచే ఏర్పాటైన రాజ్యాంగ ప్రణాళిక మాత్రమే అమలు చేయాలని ఈ తీర్మానం సారాంశం.
ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాలలో తాను చూసిన నిరక్ష్యరాస్యత, అస్పృశ్యత, అవిద్య అనారోగ్యాలు నిత్యం ఆమెను బాధ కలిగించేవి. వాటిని ఎలాగైనా నిర్మూలించాలనే లక్ష్యంతో ఆమె 1938 - 1939 మధ్య ఒక ప్రణాళికను తయారుచేసి, మూడు వందల ఆసుపత్రులను వివిధ రకాల వైద్య విధానాలతో స్థాపించింది. మంచి నీటి బావులు బాట సారులకూ, గ్రామీణులకూ నీరులేక బాధపడే ప్రాంతాలలో ఎన్నో బావులు తవ్వించింది. వయోజన విద్య పాఠశాలను నెలకొల్పింది. 1939 ఆగ్రా లోని స్త్రీ వైద్య కళాశాలను, శిశు పోషణ కారణంగా మార్పించింది. తననియోజక వర్గం లో విపరీతంగా ఉన్న మలేరియా ను అరికట్టేందుకు ఆమె ఎంతగానో, పాటుపడింది. విద్యార్థులు వ్యాయామ నిమిత్తం అనేక పట్టణ, పల్లెలలో ఆట స్థలాలెన్నో ఏర్పాటు చేసింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more