పుపుల్ జయకర్.. అంతరించి అవసాన దశకు చేరిన సాంప్రదాయ గ్రామీణ కళలను, హస్త కళలను పునరుజ్జీవింపజేయడంలో విశేష కృషి చేసిన ప్రముఖ కళాకారిణి. అంతేకాదు.. ఈమె తన రచనల ద్వారా ఎంతోమందిని చైతన్యపరిచిన గొప్ప రచయిత్రి కూడా! ఇలా ఈ రెండు రంగాలతోపాటు ఇతర రంగాల్లోనూ ఈమె విశేష ప్రతిభను ప్రదర్శించారు.
జీవిత చరిత్ర :
1915 సెప్టెంబర్ 11న ఉత్తరప్రదేశ్ లోని ఎతావా ప్రాంతంలో జన్మించింది. ఈమె తండ్రి భారత ప్రభుత్వంలో ఉదారభావాలు గల ఉన్నతాధికారి. తల్లి గుజరాత్ లోని సూరత్ కు చెందిన బ్రాహ్మణ స్త్రీ. పుపుల్ కు ఒక సోదరుడు, నలుగురు సోదరీమణులు వున్నారు. తండ్రి ఉద్యోగరీత్యా వీరి కుటుంబం భారతదేశంలోని పలు ప్రదేశాలలో గడిపింది. దీంతో ఆమెకు బాల్యం నుండే ఆయా ప్రాంతాల స్థానిక హస్త కళలు, సంస్కృతులను పరిశీలించే అవకాశం వచ్చింది. 1936లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ పట్టా పుచ్చుకొని తర్వాత బెడ్ఫోర్ట్ కళాశాల, లండన్ నుండి ఉన్నత విద్యను పూర్తి చేసింది. అనంతరం దేశానికి వచ్చి, న్యాయవాదిగా పనిచేస్తున్న మన్మోహన్ జయకర్ ను వివాహం చేసుకుని, బొంబాయి లో స్థిరపడింది.
పుపుల్ పదకొండేళ్ళ వయస్సులో వున్నప్పుడు ఈమె కాశీ వెళ్ళి అక్కడ ‘అనీబిసెంట్’ స్థాపించిన పాఠశాలలో చేరింది. తర్వాత ఈమె తండ్రికి అలహాబాద్ బదిలీ కావడంతో కుటుంబం అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఈ అలహాబాద్ లోనే ఈమెకు మొదటిసారి నెహ్రూ కుటుంబంతో పరిచయం అయ్యింది. వీరి తండ్రి, నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ మంచి స్నేహితులు. ఇక ఈమెకు ఆయన కుమారుడు నెహ్రూ, మనవరాలు ఇందిరా గాంధీతో స్నేహం కుదిరింది.
జీవిత ప్రస్థానం :
ముంబైలో స్థిరపడిన తర్వాత ఈమె చిన్న పిల్లలకోసం ‘టాయ్ కార్ట్’ అనే పత్రికను ప్రారంభించింది. 1940లో కస్తూర్బా ట్రస్ట్ కు చెందిన అప్పటి కాంగ్రెస్ నేత మృదులా సారాభాయ్ కి సహాయకురాలిగా పనిచేయడం ప్రారంభించాక ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమయ్యింది. జవహర్ లాల్ నెహ్రూ సారధ్యంలోని జాతీయ ప్లానింగ్ కమీషన్ లోని మహిళా వ్యవహారాలశాఖ కి ఉపసంచాలకురాలిగా నియమితమైంది. తర్వాత చేనేత రంగంలో ఈమెకు ఆసక్తి కలిగింది. చేనేత మంత్రిత్వ శాఖ నేతృత్వంలో మద్రాసు, బీసెంట్ నగర్ లో చేనేతకారుల సేవా సంఘమును స్థాపించింది.
తర్వాతికాలంలో ఇందిరా గాంధీకి ఆప్త మిత్రురాలిగా మారింది. 1966లో ఆమె ప్రధానమంత్రి అయ్యాక పుపుల్ ని ఆవిడ సాంస్కృటిక సలహాదారు గా నియమించింది. అనతికాలంలోనే జాతీయ హస్తకళల, చేనేత సంస్థలో వివిధ పదవులను చేపట్టి ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఎదిగింది. రాజీవ్ గాంధీ హయాంలో కూడా ఈవిడ ప్రధాన మంత్రి సాంస్కృతిక సలహాదారుగా వ్యవహరించింది. తన పదవీకాలంలో భారత చేనేత, హస్తకళల ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం లండన్, పారీస్, అమెరికాలలో ‘అప్నా ఉత్సవ్’ పేరిట పలు కళా ప్రదర్శనలను ఏర్పాటు చేయించింది. 1982లో భారత సాంస్కృతిక సంబంధ సమితికి ఉపాధ్యక్షురాలిగా నియమితమైంది. అదే సమయంలో (1985–1989) ఇందిరాగాంధీ జాతీయ మెమోరియల్ ట్రస్ట్ ఉపాధ్యక్షురాలిగానూ, ప్రధానమంత్రి సాంస్కృతిక-వారసత్వ వనరుల సలహాదారుగానూ వివిధ సేవలు అందించింది. ఇందిరాగాంధీ కోరిక మేరకు 1984లో భారత జాతీయ సాంస్కృతిక, కళా, వారసత్వ ధర్మనిధిని స్థాపించింది.
మరోవైపు.. బెంగాల్ లోని అక్షరాస్యతా ఉద్యమంకి గట్టి మద్దతును తెలిపి 1961లో వారి కార్యకలాపాలకు సహాయపడింది. తాను మరణించేంతవరకు ఆమె కృష్ణమూర్తి ఫౌండేషన్ లో చురుకైన పాత్ర పోషించింది. మనదేశంతోపాటు అమెరికా, ఇంగ్లాండు , కొన్ని లాటిన్ దేశాలలో కృష్ణమూర్తి ఫౌండేషన్ స్థాపనకు విశేష కృషి చేసింది. మదనపల్లెలోని రిషీ వ్యాలీ పాఠశాల నిర్వహణలోనూ ప్రధాన పాత్ర పోషించింది.
ఇలా తనవంతు కృషి చేసి తర్వాతి తరాలకు ఈమె ఆదర్శంగా నిలిచిన పుపుల్ జయకర్.. 81 ఏళ్ల ఏటలో 1997లో అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more