The Biography Of Madhuri Dixit | Indian Famous Film Actresses | Bollywood

Madhuri dixit biography indian famous film actress

Madhuri Dixit, Madhuri Dixit Biography, Madhuri Dixit history, Madhuri Dixit life story, Madhuri Dixit photos, Madhuri Dixit images, Madhuri Dixit wikipedia, Madhuri Dixit special story, Madhuri Dixit filmography, Madhuri Dixit awards

Madhuri Dixit Biography Indian Famous Film Actress : Madhuri Dixit is an Indian actress who is known for her work in Hindi cinema. A leading actress of Bollywood in the 1980s, 1990s and early-2000s, Dixit has been praised by critics for her acting and dancing skills, and achieved mass popularity due to her physical beauty.

తన చిరునవ్వుతో చిత్రపరిశ్రమనే మాధుర్యంలో పడేసిన తార

Posted: 05/22/2015 07:33 PM IST
Madhuri dixit biography indian famous film actress

ఓ చిరునవ్వు.. నలుగురిని సంతోషింపజేయడంతోపాటు అందరిలోనూ ఆహ్లాదాన్ని పెంచుతుంది. అప్పటివరకు వుండే మానసిక ఒత్తిళ్లు, బాధలు, ఇతర ఆందోళనలన్నీ ఆ చిరునవ్వుతో ఇట్టే మటుమాయం అవుతాయి. అదే ఓ అందమైన అమ్మాయి నవ్వితే.. ఆ ఆనందానికి అంతేలేకుండా వుంటుంది. అటువంటి తన అందమైన చిరునవ్వుతోనే అందాలతార మాధురీదీక్షిత్.. చిత్రపరిశ్రమనే తన మాధుర్యంలో పడేసింది. ఈమె నవ్వితే.. స్వర్గం నుంచి పువ్వులు రాలినట్లుగా అనిపిస్తుంది.. ఒక అందమైన ప్రపంచంలో విహరిస్తున్నట్లుగా భావన కల్పిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది.

జీవిత చరిత్ర :

1967 మే 15వ తేదీన ముంబైలో మరాఠి బ్రాహ్మణ కుటుంబంలో మాధురీ జన్మించింది. ఉద్యోగరీత్యా తండ్రి ఢిల్లీలో మకాం మార్చడంలో ఈమె విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి తన చదువు పూర్తి చేసింది. అమెకి మైక్రో బైయాలజిస్ట్ అవ్వాలనే అశయం ఉండేది. కానీ.. కథక్ నృత్యాన్ని ఎనిమిది సంవత్సరాలు అభ్యసించి అందులో ప్రావీణ్యం పొందింది. అనంతరం చిత్రపరిశ్రమలో ప్రవేశించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. అంతేకాదు.. నాటకారిణిగా ప్రఖ్యాతి పొందింది. విమర్శకులచే ఎన్నో ప్రశంసలు అందుకుని బాలివుడ్ లోని అత్యంత ఉన్నతమైన నటీమణుల్లో తానూ ఒకటిగా పేరు లిఖించుకుంది.

చిత్రజీవితం :

1984లో ‘అబోద్’ సినిమాతో మాధురి దీక్షిత్ చిత్రపరిశ్రమలో అరంగేట్రం చేసింది. కొన్నిసినిమాల్లొ సహాయనటిగా నటించిన తర్వాత ‘తేజాబ్’ సినిమాలో ముఖ్య నటి పాత్ర పొషించారు. ఈ సినిమా ఆమెకి మంచి గుర్తింపు తెచ్చివ్వడంతోపాటు మొదటి ఫిలింఫేర్ నామినేషన్ ని కూడా తెచ్చిపెట్టింది. ఇక అప్పటినుంచి హీరోయిన్ గా ఈమె జైత్రయాత్ర కొనసాగుతూ వచ్చింది. మాధురీ కేవలం నటనకే కాదు.. నాట్యకారిణిగా కూడా మంచి గుర్తింపు పొందారు.

వక్తిగత జీవితం

1999లో దీక్షిత్ అమెరికాలో స్థిరపడిన భారతీయ వైద్యుడు ‘శ్రీరాం నేనే’ను పెళ్ళాడారు. ఈయన యు.సి.ఎల్.ఎ. లో శిక్షణ పొందిన కార్డిఓ వాస్కులార్ సర్జన్. నేనే డెన్వెర్ కు చెందిన మరాఠి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. మాధురి తన కుటుంబం కలసి డెన్వర్, కొలరాడొ, యు.ఎస్.ఎ.లో నివసిస్తున్నారు.

అవార్డులు - రివార్డులు :

I. ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు
* 1990: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం ‘దిల్’
* 1992: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం ‘బేటా’
* 1994: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం ‘హం ఆప్కే హై కౌన్’
* 1997: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం ‘దిల్ తొ పాగల్ హై’
* 2002: ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం ‘దెవదాస్’

ఇంకా ఎన్నో పురస్కారాలను ఈమె పొందింది. 2008వ సంవత్సరములో భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మ శ్రీ’ బిరుదుతో సత్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhuri Dixit  Indian Film Actresses  

Other Articles