The Biography of Indian Famous Scientist Sumati Bhide | Indian Scientists | Chemistry

Sumati bhide biography indian famous scientist

Sumati Bhide, Sumati Bhide news, Sumati Bhide updates, Sumati Bhide life story, Sumati Bhide history, Sumati Bhide biography, Sumati Bhide scientist, Sumati Bhide chemistry scientist, cancer disease, cancer disease cure updates

Sumati Bhide Biography Indian Famous Scientist : The Biography of Indian Famous Scientist Sumati Bhide who researches on cancer disease.

‘మహిళా శాస్త్రవేత్తల సంఘా’నికి మొదటి అధ్యక్షులుగా పనిచేసిన సుమతి

Posted: 06/23/2015 04:52 PM IST
Sumati bhide biography indian famous scientist

మహిళలకు అంతగా స్వేచ్ఛలేని సమయంలోనూ కొందరు మహిళలు తమ ప్రతిభను నిరూపించుకోవడం కోసం సమాజాన్ని ఎదురించి ముందుకొచ్చారు. తమలో దాగివున్న ప్రతిభను వివిధరంగాల్లో కనబర్చడమే కాకుండా దేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు. అలాంటివారిలో సుమతి భిడే ఒకరు. ఈమె జీవ రసాయన శాస్త్రవేత్త. ఈమె ప్రత్యేకంగా కేన్సర్ వ్యాధి చికిత్సా రంగంలో పరిశోధనలు నిర్వహించారు. శాస్త్రీయ రంగంలో ఎన్నో సేవలు అందించిన ఈమె.. భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘానికి మొదటి అధ్యక్షురాలిగా పనిచేశారు.

జీవిత చరిత్ర :

1932 జూన్ 5వ తేదీన సుమతి భిడే జన్మించారు. పూనా విశ్వవిద్యాలయంలో ఎం.యస్సీ చదివిన ఈమె.. ఆ తర్వాత విదేశాలలో యూనివర్శిటీ ఆఫ్ బ్రుక్సెల్లెస్ లో డి.ఎస్.సి చేశారు. ఈమె ప్రత్యేకంగా కేన్సర్ వ్యాధి చికిత్సా రంగంలో పరిశోధనలు నిర్వహించారు. పొగాకు వాడకానికి, వాతావరణ కాలుష్యానికి సంబంధించి తలెత్తే వివిధ కేన్సర్ నివారణకు చికిత్సా విధానాలను శోధించారు. కేన్సర్ వ్యాధికి మూలకారణాలు - పుట్టకురుపును కలుగజేసే పదార్థములు, తారు/డాంబరు నుండి వెలువడే ఉత్పాదికకులు, వాహనముల నుండి వెలువడు విషవాయువులు, హైడ్రో కార్బన్ ల తదితర అంశాలపై సుమతి పరిశోధనలు నిర్వహించారు.

ఇలా ఎన్నో పరిశోధనలు చేసిన ఈమె.. కొన్నింటికి చికిత్సా విధానాలను కూడా అభివృద్ధిపరిచారు. ఉపకళ కనముల నుండి పుట్టిన అపాయకరమైన కాంతి (ఓ రకమైన పుట్ట కురుపు) నివారణకు పసుపు వినియోగాన్ని ఆవిష్కరించారు. పొగాకు సంబంధిత పదార్థములను నమిలేవారికి ఏర్పడు గొంతు కాన్సర్ చికిత్సా విధానాలను అభివృద్ధి పరిచారు. అలాగే.. మరికొన్నింటి నివారణకు విషయమై ప్రత్యేక పరిశోధనలు చేశారు. డాక్టర్ సుమతి పరిశోధనా కృషికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, న్యూఢిల్లీవారు అవార్డును అందించారు. కేన్సర్ పరిశోధనా రంగంలో అద్వితీయ కృషి చేసినందుకు ఐ.సి.ఎం.ఆర్. (న్యూఢిల్లీ) 1986 లో శాండజ్ ఓరేషన్ అవార్డును అందించి ఘనసత్కారం చేశారు.

పరిశోధనలు

1989 నుండి 1997 వరకు తమ పరిశోధనా ఫలితాలను వివిధ గ్రంథరచనలలో సుమతి పొందుపరిచారు. నూతన చికిత్సా విధానాలను ఆవిష్కరించారు. 49 సంవత్సరాల పరిశోధనానుభవాన్ని గడించారు. కేన్సర్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ లో సీనియర్ సైంటిస్ట్ గా (1962-78), కార్సినో జెనెసిస్ డివిజన్ కు అధిపతిగా (1978-92) పనిచేశారు. స్వామి ప్రకాశానంద ఆయుర్వేద డివిజన్ కు అధిపతిగా (1978-92) పనిచేశారు. స్వామి ప్రకాశానంద ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ (ముంబై) కు ప్రాజెక్టు డైరక్టరుగా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఇలా పరిశోధనారంగంలో గణనీయమైన సేవలందించిన ఈమె.. 1999లో మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sumati Bhide  Indian Scientists  

Other Articles