Komatireddy rajagopal reddy

Nalgonda Congress MP Gutta Sukhender Reddy, Komatireddy Rajagopal Reddy, Telangana Congress Party Bhavan,

Nalgonda Congress MP Gutta Sukhender Reddy,

Nalgonda Congress MP Gutta Sukhender Reddy.GIF

Posted: 11/17/2011 05:05 PM IST
Komatireddy rajagopal reddy

gutta_sukhender_reddy

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిదులు పార్టీని వీడి వేరు కుంపటిని పెట్టుకోబోతున్నారా? నల్లగొండలో జరిగిన ఘటన అవుననే సూచిస్తున్నది. నల్లగొండ నియోజకవర్గం కనగల్ మండలం కేంద్రంలో పలు అభివద్ది కార్రక్రమాల్లో పాల్గోనటానికి ఎంపీ గుత్తా సుఖేందర రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వచ్చారు. అధికారిక కార్యక్రమాల అనంతరం అక్కడే నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. అయితే  ఆ కార్యలయ బోర్డుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని రాయటంతో పాటు  పేరుకు ముందు తెలంగాణ ప్రాంత జిల్లాలతో కూడిన మ్యాప్ ను చిత్రికరించారు. దీనిపై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని ప్రశ్నించగా ..‘కాంగ్రెస్  పార్టీపై  మాకు సంపూర్ణమైన విశ్వాసం  ఉంది. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టో... ఇంకో  పార్టో పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు.  ఎవరో కార్యకర్తలు అత్యుత్సాహంతో బోర్డు అలా రాశారు.  ఇది వేరు కాంగ్రెస్ కాదు, అసలు కాంగ్రెస్  పార్టీ కార్యాలయమే’ అని వివరణ ఇచ్చుకున్నారు.  కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం  ‘ప్రారంభించింది ఎంపీ ..వారినే అడగండీ’ అని జావాబు దాటవేశారు.  కార్యాలయం బోర్టును మార్చటానికి  ఎంపీ, ఎమ్మెల్యే చొరవ చూపక పోవటం కొసమెరుపు.

 

 


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will arjun tendulkar rise above the pressure of expectations
Pillisubhashchandrabose wife scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles