Faction at ananthpur

faction at ananthpur

faction at ananthpur

anantapur-faction.gif

Posted: 11/24/2011 01:44 PM IST
Faction at ananthpur

     అనంతపురం జిల్లాలో ఫాక్షన్ గొడవలు పురివిప్పుతున్నాయి.  తాడిపత్రిలోని కొత్త మార్కెట్ లో ఒక వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్ళతో దాడి చేసి చంపేప్రయత్నం చేసారు.  పరిస్థతి విషమంగా ఉన్న అతన్ని హాస్పిటల్ కి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఇంత వరకూ, ఆ వ్యక్తి పేరు కృష్ణ అని మాత్రమే తెలిసింది. 
     పెరిగిపోయిన కక్షలు అంతమవకపోవటానికి కారణం, ఎవరు ముందు ఆపాలో తెలియని పరిస్థితి.  అదే ఒకరినొకరు చంపుకునే సంస్కృతిని కొనసాగేట్టుగా చేస్తుంది.  అసలు గొడవ ఎక్కడ మొదలైందో ఎవరికీ గుర్తుండదు.  వీళ్ళు చంపారని వాళ్ళు, వాళ్ళు చంపారని వీళ్ళు అలా కొనసాగుతుండటం దురదృష్టకరం.  చనిపోయిన వ్యక్తి తాలూకూ వాళ్లకైతే తెలుసు కదా ఎవరు చంపారన్నది.  వాళ్ళు ఫిర్యాదు చెయ్యలేదూ అంటే, వారి తరఫునుంచి వేటు వెయ్యటానికి చూస్తున్నారనే.  అలా హత్యకి మరో హత్య జవాబుగా సాగుతోంది కానీ, ఎక్కడో ఒక చోట దాన్ని నిలిపివేద్దామని అనుకోకపోవటమే ఫాక్షన్ మారణహోమానికి కారణమవుతోంది.  
గోదావరి నది మొదలైన చోట నాసిక్ లో చూస్తే చిన్నచిన్న బొట్లుగా ప్రారంభమై మధ్యలో ఎన్నో ఉపనదులు, వాగులు, వంకలు, కలుపుకుంటూ జీవనదిగా రూపం దాల్చినట్టుగానే ఎంత పెద్ద గొడవకైనా మూలం చాలా చిన్నదే ఉంటుంది. అయినా అసహనంతో పట్టుదలలకు పోయి అందుకు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో, మధ్యలో మరి కొందరు కూడి రాజుకున్న నిప్పుని ఎగదోసే ప్రయత్నం చెయ్యటంలో, అడుగు తిరిగి వెనక్కి తీసుకోలేని చర్యకు పాల్పడి, అక్కడి నుండి తరతరాలుగా ఆ పోరాటాలను కొనసాగించటంమీదనే వారి వంశ గౌరవం నిలబడివుంటుందనే భావనలో జీవించటం వలనే ఫ్యాక్షన్ గొడవలు ఎప్పిటికప్పడు ఊపిరి పోసుకుంటున్నాయి. 
                                                                                                                                  -శ్రీజ


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Attack on union minister sharad pawar
Konda lakshman bapuli padayatra at delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles