2004 నుంచీ ఫెర్రో ఎల్లోయ్స్ కి చెందిన 24 కంపెనీలకూ సరఫరా చేసిన విద్యుత్తు మీద ఇతర పరిశ్రమలకంటే తక్కువ ఛార్జ్ చెయ్యటం వలన ఇప్పటివరకూ 1125 కోట్ల రూపాయల రాయితీలను పొందాయా సంస్థలు. సాధారణ మధ్యవర్గాలకు 50 యూనిట్లు దాటిన తర్వాత రూ.2.80 వసూలు చేస్తుండగా ఫెర్రో ఎల్లోయ్స్ కంపెనీలనుంచి మాత్రం ప్రభుత్వం రూ. 2.65 మాత్రమే వసూలు చేస్తూవస్తోంది. హెచ్ టి 1 కేటగరీలో ఉన్న ఇతర 7922 పరిశ్రమలకు ఈ సదుపాయం ఇవ్వలేదు. పరిశ్రమలన్నిటినీ వదిలిపెట్టి కేవలం ఫెర్రో ఎల్లాయ్స్ మీద ఏమిటీ ఆప్యాయత ఎందుకంత అనురాగమన్నది ఎవరికీ అంతుచిక్కటం లేదు. పర్యావరణాన్ని కాపాడే దిశగా ఏమైనా పనిచేస్తున్నాయా లేకపోతే ప్రజాప్రయోజనకరమైన ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తులనేమైనా తయారుచేస్తున్నారా లేక చౌకగా ఇస్తున్నారా మరేమైనా కారణముందా అంటే ఏమీ కనపడటంలేదు. అలా జరిగిపోతున్నదంతే.
ఇప్పటికైనా కళ్ళు తెరచిన విద్యుత్ శాఖ ఫెర్రో ఎల్లయ్స్ పరిశ్రమలను కూడా హెచ్ టి 1 (ఎ) కేటగరీ లోకి మార్చి వేసి ఈ సంవత్సరం నుంచి మిగిలిన పరిశ్రమలకు మాదిరిగానే రూ.4.42 వసూలు చెయ్యాలని చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులంతా ఈ విషయంలో పట్టుబట్టి ముఖ్యమంత్రిని ఒప్పించటం గమనార్హం. ఈ మార్పు వలన సంవత్సరానికి 300 కోట్ల ఆదాయం పెరుగుతుందని వారంతా లెక్కకట్టి చెప్పారు.
అయితే 2004-05 నుంచి ఇప్పటివరకూ అంటే 2011-12 వరకూ ఈ విద్యుత్ రాయితీని అనుభవించిన ఫెర్రో ఎల్లాయిస్ సంస్థలు ఈ విషయంలో ప్రభుత్వానికి నచ్చచెప్దామని చూస్తున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more