పోలీస్ స్టేషన్ కి పిలవటానికి సమన్ల అవసరమే లేదా? ఎప్పుడైనా ఎవరినైనా పిలవచ్చా? పిలిస్తే రాననే హక్కు ప్రజలకు ఉందా? ఉన్నా అది జరిగే పనేనా? స్టేషన్ కి రావటానికి తాత్సారం చేసినా, ఎందుకు రావాలి అని అడిగినా అదొ పెద్ద నేరమే (ఆఫ్ ది రికార్ఢ్) అయి కూర్చుంటుంది! వెతికితే ఆ కేసులోనే కాక మరెన్ని కేసులు పీకకు చుట్టుకుంటాయో అనే భయం కూడా ప్రజల్లో ఉంది! సివిల్ కేసుల్లో కూడా పైవారి వత్తిడికి తలవొగ్గి పిలిపించటం జరుగుతుంది. "ఇదేమైనా క్రిమినల్ కేసా ఇలా పిలవటానికి?" అని అడిగితే, "క్రిమినల్ కేసు అవటానికెంత టైం పడుతుంది?" అని ఎదురు ప్రశ్నవేస్తారు.
రాత పూర్వకంగా నోటీసు లేకుండా ఎవరినీ స్టేషన్ కి పిలిపించుకునే అధికారం పోలీసులకు లేదంటూ మద్రాస్ హైకోర్టు పిటిషనర్ ల పక్షంలో తీర్పునిచ్చింది. ఉపప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఎల్ కె అద్వానీ మీద హత్యా ప్రయత్నం చేసిన నేరంలో విచారణ సాగిస్తున్న పోలీసులు తమను విచారణ పేరుతో వేధిస్తున్నారని ఒక ముస్లిం దంపతుల పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు, క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ ప్రకారం కొన్ని అధికారాలను పొందినంత మాత్రం చేత వాళ్ళే చట్టాన్ని నడిపిస్తున్నారని భ్రమపడుతూ వాళ్ళే చట్టాన్ని అతిక్రమిస్తూ సామాన్య ప్రజానీకాన్ని మాత్రం చట్టాన్ని గౌరవించాలని ఆశించటం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
పోలీస్ స్టేషన్ కి పిలిపించటానికి సరైన రికార్డ్ ఉండి, రాత పూర్వకంగా సమన్లు ఇచ్చి విచారణ జరిపించుకోవచ్చు కానీ, నోటీసులేమీ లేకుండా పోలీసులను పంపించి పిలిపించుకోవటం చట్ట విరుద్ధమని హైకోర్టు తెలియజేసింది.
సయ్యద్ సులేమాన్ సేట్, సఫరున్నీస్సా దంపతులు విచారణ పేరుతో చీటికీ మాటికీ పిలిపిస్తూ తమని వేధిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేసారు. వారి అభ్యంతరాలను తోసిపచ్చుతూ తన ధర్మాన్ని తాను నిర్వర్తించానని పోలీస్ అధికారి అన్నారు.
ధర్మాన్ని నిర్వర్తించవద్దని ఎవరూ అనరు కానీ ప్రతి ధర్మాన్ని నిర్వర్తించటానికో నిర్ణీత విధానముంటుంది. దాన్ని అవలంబించకుండా అడ్డదారిలో కొన్ని కేసులను త్వరగా పరిష్కరించాలనే ఆరాటంలో ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించటం కూడా సరైన విధానం కాదు. విచారణ కోసం పిలిపించటానికి నోటీసులు జారీ చెయ్యటం అనే ప్రక్రియ ఉంటుందని పోలీసు శాఖ ఎప్పుడో మర్చిపోయింది. ఫలానా వాళ్ళని తీసుకురా అని పోలిస్ కాన్ స్టబుల్స్ ని పంపిస్తే చాలు. అయ్యగారు రమ్మంటున్నారు వచ్చి పో అన్న విషయాన్ని అక్కడి సందర్భాన్నిబట్టి ఎలా చెప్పాలో ఎంత చెయి చేసుకోవాలో ఎంత నోరు చేసుకోవాలో తెలిసిన సిద్ధహస్తులు పోలీసు శాఖలో ఉన్నారు. అలా తీసుకురాలేనివాళ్ళు అయ్యగారి నిరసన, నోటు దురుసు పాలవుతారు.
జ్యుడిషియల్ పవర్స్ ఉన్నవారు, ఇతర దర్యాప్తు సంస్థలు నోటీసులు పంపిస్తారు, అందులో ఏ కేసులో పిలిపిస్తున్నారు, సాక్షిగానా లేక నిందితుడిగానా ఎలా హాజరవాలి అన్నది కూడా స్పష్టంగా ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం ఈ విధానానికి అతీతులని అనుకోవటాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. వాళ్ళు కూడా ఈ నియమాన్ని పాటించాలంటూ నిర్దేశించింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more