Orange fruit grapes fruits

orange fruit grapes fruits

orange fruit grapes fruits

orange.gif

Posted: 03/02/2012 05:36 PM IST
Orange fruit grapes fruits

orange fruit grapes fruits

రోజూ కమలా, ద్రాక్ష పళ్లు తింటున్నారా? అయితే, మీకు పక్షవాతం వచ్చే అవకాశం చాలా తక్కువండోయ్! యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లియాలోని నార్‌విచ్ వెద్య పాఠశాల పరిశోధకుల బృంద అధ్యయనం ఈ విషయాన్ని ద్రువీకరిస్తోంది. ఈ అధ్యయనం వివరాలు 'స్ట్రోక్' జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి.

ఈ పరిశోధకులు అమెరికాలో జరుగుతున్న నర్సెస్ హెల్త్ స్టడీలో పాల్గొంటున్న 69,622 మంది మహిళలపై తమ పరిశోధనలు నిర్వహించారు. కూరగాయలు, పళ్లు, చాకోలెట్, ద్రాక్ష సారాయి(రెడ్‌వైన్)లో మెదడుకి రక్షణనిచ్చే ఫ్లావోనాయిడ్స్ ఎంత మేరకు ఉందో వీరి ద్వారా తెలుసుకొన్నారు. ఈ మహిళల్లో కమలా, ద్రాక్ష ఎక్కువగా తిన్నవారు పక్షవాతానికి దూరంగా ఉన్నట్లు తేలింది. నిమ్మ జాతికి సంబంధించిన పళ్లను తినడం వల్ల రక్తం గడ్డ కట్టడం 19 శాతం మేర తగ్గిందని నిరూపణ అయ్యింది.

కమలా పళ్లు, కమలా పళ్ల జ్యూస్‌లో ఫ్లావోనాన్స్ (ఫ్లావోనాయిడ్స్‌లోని ఒక ఉపవర్గం) 82 శాతం, ద్రాక్ష, ద్రాక్ష జ్యూస్‌లో 14 శాతం ఉంటాయని తేలింది. "విటమిన్-సి ఎక్కువగా ఉండే పళ్లు, కూరగాయాలు తినడం వల్ల పక్షవాతం వచ్చే అవకాశం తక్కువ. ఫ్లావోనాయిడ్స్ విపరీతమైన బాధను తట్టుకునే శక్తిని ఇవ్వడమే గాక ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రధాన పాత్రను నిర్వహిస్తాయి'' అని ప్రధాన పరిశోధకుడు అయిడిన్ క్లాస్‌డీ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri lanka beat australia reach finals
Bangalore metropolitan court judge attacked and chamber damaged by lawyers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles