Russian court dismisses plea against bhagavad gita

Russian court DISMISSES plea against Bhagavad Gita,Russia, Tomsk city cour, Siberia, Hindus in Russia, news, ISKCON,, International Society for Krishna Consciousness, Bhagwat Gita, gita

Russian court DISMISSES plea against Bhagavad Gita

Bhagavad Gita.gif

Posted: 03/22/2012 11:05 AM IST
Russian court dismisses plea against bhagavad gita

Russian court DISMISSES plea against Bhagavad Gita

భగవద్గీత అనువాదం పై నిషేదం విదించాలంటూ దాఖలైన పిటిషన్ ను రష్యా న్యాయస్తానం తిరస్కరించింది. రష్యాలో భగవద్గీత పై నిషేధం విధించాలనే డిమాండ్ కొన్ని నెలల క్రితం తెర పైకి వచ్చింది. దీని వలన భారత్ – రష్యా సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్న వారికి కోర్టు తాజా నిర్ణయం ఉరట కలిగించింది. భగవద్గీత సగర్వంగా విజయం సాధించింది. అంతర్జాతీయ వేదికపై తన పవిత్రతను మరోమారు రుజువు చేసుకుంది. పవిత్ర గీతను ఉగ్రవాద సాహిత్యంగా పరిగణిస్తూ దాన్ని నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను రష్యన్ కోర్టు కొట్టేసింది. దీంతో కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా హిందువులలో నెలకొన్న ఉద్రిక్తత సడలింది. టామ్స్క్ నగరంలోని కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసిందని మాస్కో ఇస్కాన్‌కు చెందిన సాధుప్రియదాస్ తెలిపారు. ఇంతకుముందు దిగువ కోర్టు కూడా ఇదే తరహా తీర్పును ఇవ్వగా, అక్కడి న్యాయవాదులు సవాల్ చేశారు.

అక్కడా వారికి చుక్కెదురైంది. ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద రచించిన 'భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్' గ్రంధం పూర్తిగా విద్వేషపూరితంగా ఉందని, హిందూమతాన్ని ఆచరించనివారిని అవమానిస్తోందని పేర్కొంటూ దాన్ని నిషేధించాలని వారు పిటిషన్ దాఖలుచేశారు. దిగువకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించినట్లు దాస్ తెలిపారు.
కోర్టు నిర్ణయాన్ని రష్యాలో భారత రాయబారి అజయ్ మల్హోత్రా కూడా స్వాగతించారు. తీర్పు వెలువడిన అనంతరం ఇస్కాన్ కోర్టు ప్రతినిధి అలెగ్జాండర్ షకొవ్ కూడా, "ఇది పూర్తి న్యాయం, అర్ధవంతం.. ఇంకా ముఖ్యంగా సమంజసమైన నిర్ణయం'' అని వ్యాఖ్యానించారు. దేశంలో ఇస్కాన్ మీడియా కమ్యూనికేషన్ డైరెక్టర్ బ్రజేం ద్ర నందన్‌దాస్ కూడా తీర్పుపై సంతషం వ్యక్తం చేశారు. "మ నం గెలిచాం. పుస్తకాన్ని నిషేధించాలన్న పిటిషన్‌ను రద్దు చేశారు'' అని తెలిపారు. భగవద్గీతను రష్యాలో తొలిసారిగా 1788లో ప్రచురించారు. తర్వాత అనేక సార్లు పలు అనువాదాల్లో ప్రచురితమైంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women paraded naked in rajastan
Judge recommends 1 5 million to enslaved indian maid  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles