భర్త ప్రాణం కోసం సావిత్రి యముడిని ఎదురించి తన భర్త ప్రాణాలు కాపాడుకున్నట్లు మన కథలు చెబుతాయి. అలాగే భర్త ఇచ్చిన మాట కోసం అసత్యం పలకని భర్త మాట నిలబెట్టుట కోసం సత్య హరిశ్చంద్రుని భార్య .. సంతలో అమ్మబడిని విషయం కూడా మనకు నాటక రూపంలో ఉంది. అంటే పూర్వం నుండి .. భర్త కోసం భార్య ఏమైన చేస్తుంతుంది అనేది అర్థమైంది. అలాంటి ఆడవారి మీద మగవాళ్లు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. నిన్న ఒక టీవీ యాంకర్ పై భర్త దాడి చేయటం నగరంలో సంచలనం పుట్టించింది. అదే భర్త ప్రాణం కోసం జైపూర్ లో భార్య అండగా నిలిచింది.
భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు ఒక మహిళ గత్యంతరం లేని స్థితిలో వివస్త్రవగా మారిన అత్యంత దారుణమైన సంఘటన ఇది. రాజస్థాన్ లోని బన్స్ వారా జిల్లాలోని నాధ్ పూరా గ్రామంలో చోటు చేసుకుంది. కాళీ అనే మహిళ తన భర్తతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొనేందుకు పుట్టింటికి వెళ్లింది. అక్కడ కాళి బంధువులైన కుంజిహరియా, ఏకన్ అనే వ్యక్తులు పాతకక్షల నేపథ్యంలో పెద్ద గొడవపెట్టుకుని కాళి భర్తను చంపేందుకు సిద్దపడ్డారు. తన భర్తను ఏమీ చేయవద్దంటూ కాళి అడ్డుపడింది. వెంటనే ఆమె బంధువులు ఒక షరతు విధించారు. తమ ముందు వివస్త్రగా నిలబడితే వెంటనే భర్తను వదిలేస్తామని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా .. బంధువులెవరూ పెదవి విప్పలేదు. నిస్సహాయురాలైన కాళి చివరకు వారి ముందు వివస్త్రగా నిలచి భర్త ప్రాణాలు కాపాడుకుంది. అనంతరం బాధితులు బన్స్ వార పోలీస్ స్టేషన్ కెళ్లి ఫిర్యాదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more