వెంకి పెళ్ళి – సుబ్బు చావుకు రావడం అంటే ఇదే. తెలంగాణ లో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీటుకు ఎసరు తెచ్చేటట్లు కనబడుతుంది. తెలంగాణలో ఓటమికి బాధ్యత వహిస్తూ సత్తిబాబు రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు. దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే పార్టీలో తన ఇమేజ్ పెంచుకోవడంతో పాటు, ముందుగానే రాజీనామా చేయడం ద్వారా అటు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డినీ ఇరుకున పెట్టాలన్న వ్యూహంతో దీనికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా రాజీనామాకు ఇంకో కారణం కూడా ఉందని తెలుస్తుంది.
పీపీసీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి స్పీడు పెంచిన బొత్స కాంగ్రెస్ లో అన్నీ తానై నడిపిస్తున్నాడు. అయితే కోవూరులో జరిగిన ఉప ఎన్నిక కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేసిన బొత్స అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో కలత చెంది రాజీనామా చేసే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది. నేడో, రేపో దీనిపై నిర్ణయం ప్రకటించవచ్చని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలలో పార్టీ ఓడిపోయినా తాను పదవిని పట్టుకుని వేళ్లాడుతున్నానన్న విమర్శలు రావడం మంచిదికాదని, దానికంటే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయటం వల్ల అటు క్యాడర్లో ఇమేజ్ పెరగడంతో పాటు, అధిష్ఠానం వద్ద తన విలువ కూడా పెరుగుతుందని బొత్స అంచనా వేస్తున్నారు. తాను రాజీనామా చేయటం ద్వారా కిరణ్ కూడా తప్పని సరిగా రాజీనామా చేయవలసి వస్తుందని, ఆ తర్వాత తాను సీఎం పదవిని సులభంగా చేజిక్కించుకోవచ్చని సత్తిబాబు అంచనా వేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇప్పటికే బొత్స పై కాంగ్రెస్ వాళ్ళు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారందరి చేత మాటలు పడేకంటే రాజీనామా చేస్తేనే బాగుంటుందని బొత్స సత్తిబాబు అనుకుంటున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more