High court has cancelled bp acharya bail

High Court has cancelled BP Acharya's bail in EMAAR case.bp acharya, emaar case, sunil reddy, hyderabad,

High Court has cancelled BP Acharya's bail in EMAAR case.bp acharya, emaar case, sunil reddy, hyderabad,

High Court has cancelled BP Acharya bail.GIF

Posted: 03/27/2012 04:49 PM IST
High court has cancelled bp acharya bail

BP-Achryaఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో అరెస్ట్ అయిన హోంశాఖ ప్రధాన కార్యదర్శి బి.పి. ఆచార్యకు హైకోర్టు బి.పి. పెరిగే విధంగా నేడు షాక్ ఇచ్చింది. ఎమ్మార్‌ కేసులో బీపీ ఆచార్యను సీబీఐ జనవరి 30న అరెస్టు చేసి, ఫిబ్రవరి ఒకటిన ఛార్జిషీట్‌ దాఖలు చేసి ఆచార్యను నిందితునిగా పేర్కొంది. అయితే మార్చి 16న ఆచార్యకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ బెయిల్‌ను సవాల్‌ చేస్తూ మార్చి 19న సీబీఐ హైకోర్టులో లంచ్‌మోషన్‌ దాఖలు చేసింది.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సిఆర్ పిసి 306 ప్రకారం అసలు బెయిల్ ఇవ్వకూడదని హైకోర్టు తెలిపింది. రిమాండ్ విధించే అవకాశం ఉన్నా, సిబిఐ కోర్టు బెయిల్ ఇచ్చిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే లొంగిపోవాలని హైకోర్టు బిపి ఆచార్యని ఆదేశించింది. దీంతో బి.పి. ఆచార్య మళ్ళీ జైలు ఊచలు లెక్కబెట్టనున్నాడు. గతంలో శ్రీలక్ష్మికి కూడ బెయిల్ ఇచ్చి, తరువాత దానికి రద్దు చేసి ఇప్పటి వరకు బెయిల్ ఇవ్వలేదు. మరి ఆచార్యకు కూడా అలాంటి పరిస్థితే ఎదురు కావచ్చని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will balwant singh rajoana be hanged on saturday
Danam nagender  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles