పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్‌ను పొట్టన పెట్టుకున్న వారిలో సహహంతకుడు బలవంత్ సింగ్ రాజౌనాను ఉరితీయమని చండీగడ్ సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బలవంత్సింగ్ను 31న ఉరితీయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడమేకాక, కోర్టు ధిక్కార నోటీసులు కూడా పాటియాలా జైలు అధికారిపై జారీ అయ్యాయి. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో అధికారులు బలవంత్ ఉరికి సన్నాహాలు చేస్తుండగా, బలవంత్కు మద్దతుదారులు రెచ్చిపోయి విధ్వంసాలు చేయవచ్చనే సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా సైన్యాన్ని మోహరించి భారీ భద్రత కల్పించారు. అయితే ఎడిషనల్ అడ్వకేట్ జెనెరల్ మాత్రం తాము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉరిశిక్ష ఆపుతామని అంటున్నారు.
ఒకరోజు బంద్‌కు రాడికల్ సిక్స్, దళ్ ఖల్సా, ఖల్సా యాక్షన్ కమిటీ వంటి వివిధ సంస్థలు పిలుపునిచ్చాయి. ఇదే సమయంలో బల్వంత్ సింగ్ తన సోదరి ద్వారా జైలు నుంచి ఓ లేఖను పంపారు. అందులో ఆయన తన ఉరి శిక్షను రద్దు చేయాలని ఎవరూ పోరాడాల్సిన అవసరం లేదన్నారు. అకాలీ దళ్ నేతలు మోసగాళ్లు అంటూ నిందించారు. రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగడంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. లూధియానా, జలంధర్, మోగా తదితర పట్టణాల్లో భద్రతను పెంచింది. బల్వంత్‌సింగ్ అంశంలో కేంద్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణిలో ఉంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఢిల్లీలో మాట్లాడుతూ.. ఈ విషయంలో కేంద్రంగానీ, రాష్ట్రంగానీ ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదన్నారు. పంజాబ్‌కు చెందిన ఎన్జీవో సంస్థ జస్వంత్ సింగ్ ఉరిని రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more