Dravid lauds rahane after win over kings

Dravid lauds Rahane after win over Kings,Rajasthan Royals captain Rahul Dravid,Indian Premier League,Rahul Dravid,Rajasthan Royals,Ajinkya Rahane,Kings XI Punjab,IPL 2012,IPL 5,ipl2012news

Dravid lauds Rahane after win over Kings

Dravid.gif

Posted: 04/07/2012 11:02 AM IST
Dravid lauds rahane after win over kings

Rahane makes it Dravid's day as Rajasthan beat

నా అనుభవం యువ ఆటగాళ్లకు ఉపయోగపడితే సంతోషిస్తా. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ నేడు పంజాబ్‌తో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో తొలిసారిగా బరిలోకి దిగబోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ద్రవిడ్ .

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ పంజాబ్‌తో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో తొలిసారిగా బరిలోకి దితున్నాడు. అయితే ఈ విషయంలో తనకెలాంటి ప్రత్యేక అనుభూతి కలగడం లేదని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఈ సీజన్‌లో మరింత రాణించాలనే ఆసక్తితో ఉన్నానని అన్నాడు. ‘ఐపీఎల్‌లో గత నాలుగేళ్లుగా ఆడుతున్నాను. అందుకే ప్రత్యేకంగా ఏమీ అనిపించడం లేదు. షేన్ వార్న్ నుంచి కెప్టెన్సీతో పాటు కోచ్, మెంటర్ బాధ్యతలను తీసుకున్నాను కాబట్టి నాపై కొద్దిపాటి అంచనాలున్న మాట వాస్తవమే.

అయితే ఆటగాళ్లు, సిబ్బంది సహాయంతో మంచి ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. ప్రతీ జట్టులో నాణ్యమైన దేశవాళీ ఆటగాళ్లున్నారని, అయితే కేవలం నలుగురు విదేశీ ఆటగాళ్లనే ఆడించడం సరిపోదని సూచించాడు. రహానే, మనేరియా మరికొంత మంది ఆటగాళ్లతో తమ జట్టు బాగుందని అన్నాడు. గత వారం రోజులపాటు జరిగిన శిబిరంలో మనేరియా బ్యాటింగ్ తీరు చూసి ఆశ్చర్యపోయానని, అతడు తమకు చాలా కీలకమని కొనియాడాడు. ఐపీఎల్‌లో రాణిస్తే అతడికి చక్కటి కెరీర్ ఉంటుందని అన్నాడు. ఈ టోర్నీలో ఫలానా జట్టు బలమైంది, ఫలానాది బలహీనమైనదని చెప్పలేం. తొలి మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తికరమే. పంజాబ్‌పై గెలిచి శుభారంభాన్నివ్వాలనుకుంటున్నాం’ అని ద్రవిడ్ చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu nri scientist ms reddy nominated to the nobel prize
Tara chowdary sex racket big names could pop up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles