Barack obama mitt romney in a tight race

President Barack Obama and his likely Republican challenger Mitt Romney are locked in a tight race in the November presidential poll as Romney solidified support within his party

President Barack Obama and his likely Republican challenger Mitt Romney are locked in a tight race in the November presidential poll as Romney solidified support within his party

Barack Obama, Mitt Romney in a tight race.gif

Posted: 04/21/2012 01:09 PM IST
Barack obama mitt romney in a tight race

Mitt-romneyఅమెరికాలో నవంబర్ లో  జరగబోయే అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. తాజాగా నిర్వహిస్తున్న సర్వేల్లో ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడుతున్నాయి.  పోయిన ఎన్నికల్లో ఏరికోరి ఒబామాను ఎన్నుకున్న అమెరికా ప్రజలు ప్రస్తుతం అతని పై అంతగా ఆసక్తి చూపడం లేదని సర్వేలో తేలింది. ఒబామా ప్రత్యర్థి అయిన రోమ్నీ వైపే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తాజా సర్వే రిజల్ట్స్ లో ప్రజాదరణ విషయంలో ఒబామా స్వల్ప ఆధిక్యంలో ముందంజలో ఉండగా, ఆర్థిక పరమైన అంశాల్లో మాత్రం రోమ్నీ దూసుకుపోతున్నారని వెల్లడైంది.

విన్నిపెక్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ సర్వేను గురువారమిక్కడ విడుదల చేశారు. సర్వేలో ఒబామాకు 46 శాతం మంది, రోమ్నీకి 42 శాతం మంది ప్రజలు మద్దతిస్తున్నట్లు తేలింది. ఇక ఆర్థిక పరమైన అంశాల్లో రోమ్నీకి 47 శాతం, ఒబామా కు 43 శాతం మంది మద్దతు ప్రకటించారు. ఉద్యోగాల కల్పన, గ్యాస్ ధరలు, ఇమిగ్రేషన్ వంటి విషయాల్లో రోమ్నీనే ఆధిక్యంలో ఉన్నారు. మహిళల్లో మాత్రం ఎక్కువ మంది ఒబామాకే జై కొడుతున్నారు. 49 శాతం మగువలు ఒబామాకు మద్దతిస్తుండగా, రోమ్నీకి కేవలం 39 శాతం మంది మాత్రమే మద్దతిస్తున్నారు. ఒబామా రెండోసారి అధ్యక్షుడు కావాలని 45 శాతం మంది కోరుకుంటుండగా, వద్దేవద్దని 49 మంది అభిప్రాయపడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో ఒబామా విఫలమయ్యారని 56 శాతం అభిప్రాయపడగా, 38 శాతం ఫర్వాలేదని బదులిచ్చారు. మరి ఈ సర్వేలు ఎంతవరకు నిజం అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood movies make youth drink
Pakistan plane crash victims mourned  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles