Gandhi ambedkar

gandhi, ambedkar, mahatma gandhi , ambedkar statues, Beer battle ,

gandhi, ambedkar,

gandhi.gif

Posted: 05/04/2012 06:58 PM IST
Gandhi ambedkar

gandhi

జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి గురువారం ఇలా తాడును ఉరిలా తగిలించి క్రేన్ సాయంతో తీసుకెళ్లడం విమర్శలకు దారి తీసింది. ఇక్కడ విగ్రహ ఏర్పాటుకు టీడీపీ సీనియర్ నేత రాంభూపాల్‌చౌదరి కలెక్టర్ నుంచి అనుమతి పొందారు. ఏప్రిల్ 30న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా కార్యక్రమం నిలిచిపోయింది. ఈ క్రమంలో విగ్రహాన్ని వేరొక చోటకు తరలించేందుకు చేసే ప్రయత్నంలో.. బాపూజీ మెడకు ఉరి వేసినట్లుగా తాడు తగిలించారు. దీనిపై పలువురు మండిపడ్డారు.

అంబేద్కర్ విగ్రహానికి బీరు బాటిల్

కరీంనగర్ జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్ర హం వేలికి గుర్తుతెలియని వ్యక్తులు బీరు సీసా తగిలించి అవమానించారు. తెల్లవారే సరికి ఈ వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో అంబేద్కర్ సంఘాలు, దళితులు గ్రామస్థులు పెద్దఎత్తున చేరుకున్నారు. హన్మకొండ-సిద్దిపేట ప్రధాన రహదారిపై భైఠాయించారు. సుమారు రెండు గంటలకుపైగా ధర్నా, రాస్తారోకోలతో ఉద్రిక్తత నెలకొంది. త్వరలో దుండగులను పట్టుకుంటామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి మళ్లీ ముసుగు తొడిగారు. మరోవైపు విగ్రహ ఆవిష్కరణకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vellulli
Minister erasu vs dl ravindra reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles