సూరిని హత్య చేయడానికి రెండు రోజుల ముందు బంజారాహిల్స్‌లోని ఒక పేరొందిన పబ్‌లో నానా హంగామా చేసినట్లు తెలిసింది. ఫ్యాక్షన్ నేత మద్దెలచెర్వు సూరి హత్యకేసు ప్రధాన నిందితుడు భాను కిరణ్ వ్యవహారంలో విస్మయం గొలిపే పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేగాక నగర శివార్లలోని నిర్మానుష్య ప్రదేశంలో తన 'ఫైరింగ్' నైపుణ్యాన్ని పరీక్షించుకున్నాడు. సూరిని చంపేందుకు సిద్ధమయ్యే ముందు నాటు (దేశవాళీ) తుపాకీని ఉపయోగించి సాధన చేశానని ప్రస్తుతం సిఐడి అధికార్ల దర్యాప్తులో ఉన్న భాను వారితో చెప్పాడు. శంషాబాద్ వద్ద శివార్లలోని నిర్మానుష్య ప్రదేశంలో సుమారు ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు అధికార్లు చెప్పారు. అయితే, వరుస కాల్పుల కోసం నాటు తుపాకులపై ఆధారపడలేరని, మొదటి రౌండ్‌కే ఇవి వేడెక్కిపోతాయని, రెండవ రౌండ్ అంతగా విజయవంతం కాకపోవచ్చని, అందుకే సూరిని చంపేందుకు భాను అసలైన ఆయుధాన్ని ఉపయోగించాడని దర్యాప్తు అధికారి ఒకరు పేర్కొన్నారు.
భాను వద్ద దేశవాళీ రకం తుపాకులు తొమ్మిది వరకూ ఉన్నాయని, వాటిలో ఒక దానితో తన నైపుణ్యాన్ని పరీక్షించుకుని, అసలైన దానితో సూరిని చంపాడని అన్నారు. ఫైరింగ్ నైపుణ్యాన్ని పరీక్షించుకునే సమయంలో భాను వెంట సినీ నిర్మాత సింగనమల రమేష్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులున్నారని సమాచారం. సూరిని చంపే ముందు బంజారాహిల్స్‌లోని టచ్ పబ్ వద్ద పార్టీ చేసుకున్నట్లు భాను దర్యాప్తు బృందానికి చెప్పాడు. ఆ రోజుల్లో భాను చాలా విలాసంగా గడిపాడని, హత్యానంతరం ప్రయివేట్ ఉద్యోగినంటూ ఢిల్లీలోని శర్మ లాడ్జిలో బస చేశాడని అధికార్లు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం సూరి పేరిట అనంతపురం జిల్లాలో రూ.25 లక్షల వరకూ ఖర్చు చేసినట్లు కూడా అధికార్లకు భాను చెప్పాడు. రియల్ ఎస్టేట్ డెవలపర్లకు భారీ ప్రాజెక్ట్‌లను ఇప్పించినందుకు గాను భానుకు వచ్చిన భారీ మొత్తాల్ని కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులైన మంగలి కృష్ణ, శ్రీనివాస్ అనే వారితో పంచుకున్నట్లు చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more