గత ఏడాది సెప్టెంబర్ 5న గాలి జనార్దన్‌రెడ్డిని సిబిఐ అధికారుల బృందం బళ్లారిలోని ఆయన నివాసంలో అరెస్టు చేసింది. గాలితోపాటు ఒఎంసి ఎండి బివి నివాస్‌రెడ్డిని కూడా అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చింది. ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఒఎంసి) కేసులో ప్రధాన నిందితుడు, కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ గాలి జనార్దన్‌రెడ్డికి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. ఇదే కేసులో నిందితురాలిగా చంచల్‌గూడ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఈ ఇద్దరి బెయిల్ పిటిషన్లపై వీడియో కానెఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ జరిపింది. అప్పటినుంచి 8 నెలలపాటు గాలి జైల్లోనే ఉన్నారు. ఇప్పటికి ఆరుసార్లు బెయిల్ కోసం సిబిఐ కోర్టు, హైకోర్టులను ఆశ్రయించగా ఏడోసారి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని, సిబిఐ విచారణకు సహకరించాలని కోర్టు షరతులు విధించింది. ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ, రూ.5 లక్షల పూచీకత్తు సమర్పించాలని బెయిల్ మంజూరు ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. బళ్లారిలో ఉన్న అసోసియేట్ మైనింగ్ కార్పొరేషన్ (ఏఎంసి)పై సిబిఐ నమోదు చేసిన వేరే కేసులో అక్కడి సిబిఐ అధికారులు పిటి వారెంట్‌పై ఇటీవల తీసుకెళ్ళి అరెస్టు చేసి బెంగళూరు జైలుకు పంపించారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more