Ninety one year old athlete takes gold

Ninety-one-year-old athlete takes gold, krishna district, seetharamaiah,

Ninety-one-year-old athlete takes gold

gold.gif

Posted: 07/06/2012 06:49 PM IST
Ninety one year old athlete takes gold

Ninety-one-year-old athlete takes gold

ఆయన ఇప్పటికి కేవ్వు కేక. ఆయన వయస్సు 91 ఏళ్లు.  వయసును బట్టి  ముసలివాడు అనుకుంటే పొరపడినట్లే..  ఉత్సాహం ఉట్టిపడే 19 ఏళ్ల  నవయువకుడు అతను.  ఇప్పటికీ అథ్లెటిక్స్ లో  రాణిస్తూ..  సాధించిన బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు  90కి పైగానే ఉన్నాయి.  తొమ్మిది  పదుల వయస్సులోనూ  ఇంకా  సాధించాలనే తపన.. పోటీల్లో  ప్రథముడిగా నిలవాలనే  ఉత్సాహం  తగ్గలేదు.  అవే ఆయనకు  బంగారు పతకాలు  సాధించి పెడుతున్నాయి.  ఇటీవల బెంగళూరులో  జరిగిన  32వ జాతీయ  మాస్టర్స్  అథ్లెటిక్  ఛాంపియన్ షిప్ పోటీల్లో  రాష్ట్రం  తరపున పాల్గొని నాలుగు బంగారు  పతకాలు   సాధించారు.  ఆయనే బొబ్బా సీతారామయ్య. క్రిష్ణా జిల్లా  ఆగినపర్రులో  1922లో జన్మించారు. మొట్టమొదటి సారి  1938లో గుంటూరు జిల్లా నరసారావు పేటలో  జరిగిన  చెడుగుడు పోటీల్లో  పాల్లొని  జట్టును  విజేతగా నిలిపారు.  1950 లో ఉమ్మడి  మద్రాసు రాష్ట్రంలో  జరిగిన  జాతీయ స్థాయి చెడుగుడు  పోటీల్లోనూ  జట్టును  ప్రథమ  స్థానంలో  నిలిపారు. 1990 వరకు  రాష్ట్రంలో  ఎక్కడ  చెడుగుడు  పోటీలు జరిగినా క్రిష్టా జిల్లా జట్టు తరపున పాల్గొని  తన సత్తా చాటారు. ప్రస్తుతం  గుంటూరు జిల్లా పత్తి పాడు మండలం చినకొండ్రుపాడులో  ఉంటున్నారు. 1990 నుంచి వెటరన్ అథ్లెటిక్స్ లో  అగుడు పెట్టిన  సీతారామయ్య షాట్ పుట్,  జావలిన్ త్రో తదితర విభాగల్లో  బంగారు పతకాలు సాధించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandra deo in race for vice president
Cricketer ajay tyagi shot dead in ghaziabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles