ప్రతీ ఒక్కరు ఎరుపు రంగును ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తూ ఇష్టపడుతుంటారు... కానీ డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌కు మాత్రం ఆ రంగంటేనే కంపరం పుడుతుందని చెబుతున్నాడు. నిజానికి ఓ ఏడాది క్రితం యువీకి కూడా ప్రతీది ఎరుపు రంగులోనే ఉండేందుకు ఆసక్తి చూపేవాడు. అయితే క్యాన్సర్ వ్యాధికి గురైన అనంతరం తన ఇష్టాన్ని మార్చుకున్నాడు. ఎందుకంటే... ‘ఎరుపు నాకిష్టమైన రంగుగా ఉండేది. అయితే నాకొచ్చిన వ్యాధి కారణంగా చాలా రక్తాన్ని కళ్లచూడాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు ఆ రంగంటేనే అసహ్యం పుడుతోంది. అసలా రంగును చూస్తే ఇప్పుడు చాలా చికాకుగా ఉంటుంది’ అని గుర్గావ్‌లోని తన క్రికెట్ అకాడమీలో మాట్లాడుతూ యువీ అన్నాడు. వ్యాధి నుంచి కోలుకున్నాక ఆట పట్ల తన ధృక్పథం మారిందని చెప్పాడు. దేశం కోసం మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూడడం గొప్పగా అనిపిస్తుందన్నాడు. ‘ఇంతకుముందు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవాణ్ణి. ఇప్పుడు నా రెండు ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకోగలుగుతున్నాను. కీమో చికిత్స సమయంలో ఆహారం వాసన చూసేవాణ్ణి కానీ తినలే ని పరిస్థితి ఉండేది. ఇప్పుడు సమోసా కూడా తింటున్నాను. మొత్తానికి మామూలు జీవితంలోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నాలుగు నుంచి ఆరు నెలల వరకు మంచానికే పరిమితం కావడంతో ఇక ఆడగలనని అనుకోలేదు. త్వరగా కోలుకోవడంతో ఇది సాధ్యమైంది’ అని 30 ఏళ్ల యువీ అన్నాడు. ప్రాక్టీస్‌లో పాదాల కదలిక కొంచెం నెమ్మదిగానే ఉన్నా బంతిని బాగానే కొట్టగలుగుతున్నానని చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more