ఒలింపిక్ పతకం.. ప్రతి అథ్లెట్‌కూ చిరస్మరణీయమే. అందుకోసం కఠోర శ్రమ.. ఎన్నో త్యాగాలు.. ఏ అథ్లెట్లకైనా ఇది సాధారణమే..! కానీ చైనా అథ్లెట్ల 'బంగారు' విజయాల వెనక విషాదభరితమైన రహస్యాలు దాగున్నాయి. మానవత్వానికి దూరంగా వాళ్లు ఒలింపిక్ స్టార్లుగా ఎదిగారు. ఒలింపిక్ పతకం సాధించిన వారంతా.. సంబరాల్లో మునిగిపోతుంటే.. ఏళ్లకు తరబడి ఇంటికి దూరంగా ఉండి డైవింగ్‌లో స్వర్ణం సాధించిన చైనా డైవర్ వు మిన్‌క్సియా మాత్రం విషాదంలో ముగినిపోయింది. మహిళల సింక్రనైజ్డ్ 3 మీటర్ల స్ప్రింగ్ బోర్డ్ డైవింగ్‌లో వరుసగా మూడో ఒలింపిక్ స్వర్ణం సాధించి దిగ్గజ డైవర్‌గా నిలిచిన 26 ఏళ్ల మిన్‌క్సియాకు కుటుంబ సభ్యులు చెప్పిన చేదు నిజాలు శోకాన్ని మిగిల్చాయి. వరుసగా మూడు ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత తల్లిదండ్రులు వెల్లడించిన విషయాలు ఆమెను షాక్‌కు గురిచేశాయి...లండన్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా మిన్‌క్సియా ఏళ్లకు తరబడి కుటుంబానికి దూరంగా ఉంది. ఈ క్రమంలో ఏడాది క్రితం తాతయ్య, నానమ్మలు చనిపోయిన సంగతి తల్లిదండ్రులు ఆమెకు తెలియనివ్వలేదు. తెలిస్తే.. తమ కుమార్తె పతకం వేట ఎక్కడ ఆగిపోతుందోనన్న ఆందోళన వారి గొంతునొక్కేసింది. అంతేకాదు చాలాకాలంగా మిన్‌క్సియా తల్లి రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నా ఆ విషయం కూడా ఆమెకు తెలీకుండా జాగ్రత్త పడ్డారు.కుటుంబ సమస్యలు తమ కుమార్తె ఏకాగ్రతకు భంగం కలిగించకూడదనేదే వారి ప్రధానోద్దేశం! వారనుకున్నదే నిజమైంది. ఏథెన్స్, బీజింగ్ ఒలింపిక్స్‌లో హీ జీతో కలిసి సింక్రనైజ్డ్ విభాగంలో రెండు స్వర్ణాలు చేజిక్కించుకున్న మిన్‌క్సియా లండన్‌లో జరిగిన ఫైనల్స్‌లోనూ అద్భుత విజయంతో హ్యాట్రిక్ గోల్డ్ కొట్టింది. ప్రపంచ డైవింగ్ చాంపియన్‌షిప్‌లోనూ మిన్‌క్సియానే చాంపియన్.
అయితే మిన్‌క్సియాకు ఎప్పటికైనా నిజం చెప్పక తప్పదని ఆమె తండ్రి యూమింగ్ అన్నాడు. 'ఆరేళ్ల వయసులో మిన్‌క్సియాను డైవింగ్ ట్రయినింగ్‌లో చేర్పించాం. 16 ఏళ్లపుడు ప్రభుత్వ ఆక్వాటిక్ ట్రయినింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ కోసం ఆమె ఇల్లు వదిలి వెళ్లింది. అప్పుడే ఆమెకు మాతో సంబంధం లేదని భావించాం.ఇప్పుడామె స్టార్‌గా ఎదిగింది. ఇప్పటికైనా ఆమె కుటుంబంతో సంతోషంగా గడపాలని మేం ఆలోచించడం లేదు' అని యూమింగ్ వివరించాడు. మిన్‌క్సియా తల్లి కూడా తమ నిర్ణయాన్ని సమర్థించింది. తనకున్న రొమ్ము కేన్సర్ తగ్గేదాకా మిన్‌క్సియాకు ఈ విషయం చెప్పకూడదనే అనుకున్నానని చెప్పింది. అయితే తమ కుమార్తె కెరీర్‌లో విజయం సాధించడంపట్ల ఆమె ఆనందం వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more