విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులు వారిని మానసికంగా దెబ్బతీస్తున్నారు. అందరూ కాకపోయినా కొంత మంది గురువులు అమానుషంగా ప్రవర్తించడం గురుస్థానానికే అగౌరవాన్ని తెచ్చిపెడుతుండటం విచారకరం. గురువుల వేధింపులకు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని బలైంది. కన్నతండ్రి అకాల మరణాన్ని దిగమింగుకుని భవిష్యత్‌పై గంపెడు ఆశతో కాలేజీకి వెళ్లిన ఆ విద్యార్థిని మృతి చెందడం ఆ కుటుంబాన్ని కోలుకోని షాక్‌కు గురిచేసింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలోని గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న మౌనిక ఎప్పటిలాగే శనివారం కాలేజీకి వెళ్లింది. మధ్యాహ్నం కళాశాల రెండవ అంతస్తు మీద నుంచి కిందికి దూకింది. ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి అధ్యాపకులు పద్మప్రియ కారణమని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. లెక్చరర్ పద్మప్రియ అకారణంగా మౌనికను దూషించారని అది భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యార్థులు అంటున్నారు. కాలేజీ భవనం పై నుంచి మౌనిక దూకిందన్న సమాచారం తెలుసుకున్న యాజమాన్యం హుటాహుటిన ఆమెను కుషాయిగూడలోని తులసి ఆసుపత్రికి తరలించారు. ఆమెను బతికించడానికి శ్రమించినా ఫలితం దక్కలేదు. మౌనిక కుటుంబం సైనిక్‌పురి గోకుల్‌నగర్‌లో నివాసం ఉంటోంది. తండ్రి జగదీశ్‌గౌడ్ ఇటీవలే మరణించారు. తల్లి పద్మ, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తానని మౌనిక చెప్పిందని, ఇంతలోనే తమను వీడి వెళ్లిపోయిందని విలపిస్తున్నారు. ఇదిలావుండగా మౌనిక మృతిపై గీతాంజలి ఇంజనీరింగ్ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కీసర, కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక మృతిపై విద్యార్థి సంఘాలు బందుకు పిలుపునిచ్చాయి. కాగా, మౌనిక మృతి ముమ్మాటికీ యాజమాన్య నిర్లక్ష్యమేనని ఎఐఎస్‌ఎఫ్ గ్రేటర్ అధ్యక్ష కార్యదర్శులు టి.సత్యప్రసాద్, కె.ధర్మేంద్ర ఆరోపించారు. మౌనిక కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యంపై ఉందని, తక్షణం ఆమె కుటుంబానికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more