శంషాబాద్ విమానాశ్రయం ఇకమీదట మరింత బిజీబిజీగా మారనుంది. కనీసం మరో అర డజను విదేశీ విమాన సంస్థలు త్వరలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనున్నాయి. చౌక చార్జీల టైగర్ ఎయిర్‌వేస్‌తో పాటు థాయ్ స్మైల్ కూడా వచ్చే నెలలో శంషాబాద్‌కు రానుంది. ఇక ఆఫ్రికాలో బాగా పేరున్న కెన్యా ఎయిర్‌వేస్, ఇండోనేషియా అధికారిక విమానయాన సంస్థ గరుడ కూడా భాగ్యనగరానికి రావడానికి సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి సిల్క్ ఎయిర్ సంస్థ హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు నేరుగా విమానాలు నడుపనుంది. ఇలా నడిపే సంస్థల్లో ఇది రెండోది. విమానాశ్రయ వర్గాల రికార్డుల ప్రకారం ఈ మార్గంలో ఏటా 60 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. అలాగే థాయ్‌లాండ్‌కు ఇక్కడి ప్రయాణికులు ఎక్కువే. థాయ్‌స్మైల్ రాకతో మరింత మంది పర్యాటకులు ఆ దేశానికి వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 16 నుంచి ఈ సంస్థకు చెందిన మొదటి విమానం శంషాబాద్ నుంచి ఎగరబోతోంది.దట్టమైన అడవులు, ఆహ్లాదకరమైన ప్రాంతాలతో కూడిన ఆఫ్రికన్ దేశాల్లో పర్యటనలకు ముచ్చట పడని వారుండరు.
హైదరాబాదీ పర్యాటకులకు వల వేయడానికి కెన్యన్ ఎయిర్‌వేస్ సిద్ధమవుతోంది. 2014 నాటికి ఈ సంస్థ ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రా రంభిస్తుందని అంచనా. త్వరలో 7875 తరహా విమానాలు ఒక డజ ను కొనేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇవి తమ చేతికి వచ్చాయంటే హైదరాబాద్‌తో సహా ఆరు నగరాల్లో వీటిని నడుపుతామని కెన్యా ఎయిర్‌వేస్‌కు చెందిన ఏరియా మేనేజర్ బెన్నెట్ స్టీఫెన్స్ తెలిపారు.ఆఫ్రికన్ పర్యాటకుల సంఖ్య ఏటా 30-35% చొప్పున పెరుగుతోంది. పెద్ద పెద్ద ఐటీ సంస్థలు బోట్స్‌వానా, కెన్యా లాంటి దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరించుకుంటుండటంతో అక్కడకు తరచు వెళ్లేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికితోడు ఆఫ్రికా దేశాలలో వ్యవసాయానికి మన రైతులు ఉత్సాహం చూపడం కూడా ప్రయాణికుల సంఖ్యను పెంచుతోంది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోడానికి కెన్యా ఎయిర్‌లైన్స్ సిద్ధంగా ఉందని 'వన్‌స్టాప్ హాలీడేస్' సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మీర్ లియాఖత్ అలీ తెలిపారు. ఇండోనేషియన్ ఎయిర్‌లైన్స్ గరుడ సైతం శంషాబాద్‌కు క్యూ కడుతోందని ఆయన తెలిపారు. వీటితో పాటు యూరోపియన్ ఎయిర్‌లైన్స్, జెట్‌స్టార్ ఏషియా, మయన్మార్ ఎయిర్‌వేస్ వంటి పలు సంస్థలు త్వరలో హైదరాబాద్‌కు జై అంటాయని ఇటీవలే సెంటర్ ఫర్ ఏసియా పసిఫిక్ ఏవియేషన్ (కాపా) 2012-13 నివేదిక తెలిపింది. ఇప్పటికే శంషాబాద్ నుంచి 10 విదేశీ ఎయిర్‌లైన్స్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి కొత్త సంస్థలు తోడైతే శంషాబాద్ బిజీగా మారిపోవడం ఖాయం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more