Sachin tendulkar his family a must watch movies

sachin tendulkar his family a must watch movies,Sachin Tendulkar's Family Consisting Of His Father, Mother, Wife, Son & His Daughter

sachin tendulkar his family a must watch movies

sachin.gif

Posted: 08/21/2012 12:27 PM IST
Sachin tendulkar his family a must watch movies

sachin tendulkar his family a must watch movies

బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ సుదీర్ఘ విరామానంతరం మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. సచిన్ ఆడిన చివరి సిరీస్ ఆసియా కప్. బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో చరిత్రాత్మక వందో సెంచరీ చేశాక ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకున్నాడు. మధ్యలో ఐపీఎల్-5లో ఆడినా ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు దూ రంగా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌తో మాస్టర్ కొత్త సీజన్‌ను ప్రారంభిస్తున్నాడు.  దిగ్గజ బ్యాట్స్‌మెన్ ద్రావిడ్, లక్ష్మణ్ లేకుండా సచిన్ ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ కూడా ఇదే. దీనికోసం బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో సన్నద్ధమయ్యాడు. ఇంతకీ విరామంలో సచిన్ ఏం చేశాడంటే.. ఎక్కువ సమయం కుటుంబంతోనే గడిపాడట. వారితో కలిసి సినిమాలు చూశానని చెప్పాడు. ఇక తనయుడు అర్జున్‌ను శిక్షణకు తీసుకెళ్లడం.. విదేశీ టూర్లు.. ఇలా విరామాన్ని ఆస్వాదించినట్టు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇంకా సచిన్ ఏమన్నాడంటే అతని మాటల్లోనే..విరామంలో సాధారణంగా ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతా.

అయితే, ప్రతీ సిరీస్‌కు కొన్ని రోజుల ముందు నుంచే సన్నద్ధమవుతా. కొన్నేళ్లుగా ఇదే పద్ధతి పాటిస్తున్నా. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాం అనే విషయంపై కూడా ప్రాక్టీస్ ఆధారపడి ఉంటుంది. వెంటవెంటనే సిరీస్‌లు ఉన్నప్పుడు ఎక్కువ విరామం ఉండదు. కొత్త సీజన్ ఆరంభంలో మాత్రం సన్నాహకానికి ఎక్కువ సమయం తీసుకుంటా. ఇక సీజన్ ముగిశాక నా ఆటతీరు మొత్తం సమీక్షించుకుంటా. విజయవంతమైన సందర్భాలు, ఇంకా మెరుగ్గా ఆడాల్సినవి.. ఇలా అన్ని విషయాలపై దృష్టిసారిస్తా. సీజన్ మధ్యలో సిరీస్ తర్వాత కూడా అంచనా వేస్తుంటాను. రిటైర్మెంట్ యోచన లేదు: రిటైర్మెంట్ గురించి ఆలోచిండం లేదు. ఆ సమయం వచ్చినపుడు వీడ్కోలు చెబుతా. ప్రస్తుతం నా ఆటను ఆస్వాదించడంపైనే దృష్టిసారిస్తున్నా. ఎన్‌సీఏలో ప్రాక్టీస్ చేయడం వల్ల ఆటలో పూర్తిగా లీనం కావడానికి ఉపయోగపడుతుంది. కోచ్‌గా ఫ్లెచర్ బాధ్యతలు చేపట్టాక గతేడాది వరుస ఓ టములు ఎదురై ఉండొచ్చు. అత్యుత్తమ జట్లకు కూడా కొన్ని సార్లు పరాజయా లు తప్పవు. అయితే, అతను తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించాడనే భావిస్తు న్నా. ఫ్లెచర్‌కది పరీక్షా సమయం. అతనెప్పుడూ కుంగిపోలేదు. సహనంతో స వాళ్లను ఎదుర్కొన్నాడు. జట్టును మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంపైనే దృష్టిసారించేవాడు. అలాంటి పరిస్థితిని అధిగమించడం ఎవరికైనా కష్టమైన పనే. ఎంపీ కావడం గౌరవంగా భావిస్తున్నా: నేను ఎన్నికల్లో పోరాడి ఎంపీ కాలే దు. ఈ పదవి ఇవ్వమని ఎవర్నీ అడగలేదు. ఎంపీగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నా. అందుకే ఈ పదవిని అంగీకరించా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajiv gandhi international airport shamshabad
I did not get any invite from sports ministry shastri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles