Arvind kejriwal coal war

Arvind Kejriwal takes coal scam to PM’s residence,Arvind Kejriwal, Manish Sisodia, Gopal Rai, Kumar Vishwas, Manmohan Singh, Delhi Police, India Against Corruption, Arvind Kejriwal detained, IAC, Kumar Vishwas, Arvind Kejriwal, Gherao, Prime Minister, PM Residence, Sonia Gandhi, 7 Race Course, 7 RCR, 10 Janpath, Coalgate, Coal Block Allocations, Congress, BJP, Nitin Gadkari

Arvind Kejriwal takes coal scam to PM’s residence

Arvind.gif

Posted: 08/27/2012 12:35 PM IST
Arvind kejriwal coal war

Arvind Kejriwal takes coal scam to PM’s residence

 బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలను నిరసిస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంతో పాటు కాంగ్రెస్, బిజెపి అధ్యక్షుల నివాసాలను ముట్టడించేందుకు సామాజిక ఉద్యమకారుడు, అన్నా హజారే బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్, ఆయన మద్దతుదారులు న్యూఢిల్లీలో కదం తొక్కారు. దీంతో రాజధాని మరోసారి ఉద్రిక్తంగా మారింది. వరకూ ఈ ఆందోళనలు అడపా దడపా కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు బాష్పవాయువును, వాటర్ క్యానన్లలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టడంతో పాటు కేజ్రీవాల్‌ను, ఆయన మద్దతుదార్లను వందలాది సంఖ్యలో అరెస్టు చేశారు. ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు ఉపక్రమించిన కేజ్రీవాల్‌ను పోలీసులు రెండుసార్లు అరెస్టు చేశారు. ఈ నిరసనలో బిజెపిని కూడా టార్గెట్‌తో అన్నా బృందం సభ్యురాలు కిరణ్ బేడీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీంతో అన్నా బృందం సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి.అంతకుముందు ప్రధాని నివాసం వైపు ప్రదర్శనగా వెళ్తున్న ఆందోళనకారులను పోలీసులు నిలువరించలేకపోయారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాడుకుని వారు ప్రధాని నివాసాన్ని సమీపించారు.

Arvind Kejriwal takes coal scam to PM’s residence

అయితే ఆ తర్వాత పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకోగలిగారు. జంతర్ మంతర్ వద్ద వేర్వేరు బృందాలుగా విడిపోయిన ఆందోళనకారులు రేస్‌కోర్స్ రోడ్‌లోని ప్రధాని నివాసంవైపు, 10 జన్‌పథ్‌లోని సోనియా నివాసంవైపు, తుగ్లక్ రోడ్‌లోని నితిన్ గడ్కరీ నివాసంవైపు విడివిడిగా ప్రదర్శనలు నిర్వహించారు. జన్‌పథ్, అక్బర్ రోడ్, తుగ్లక్ రోడ్‌లలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. ఈ ఆందోళనల్లో అగ్రభాగాన నిలిచిన అన్నా బృందం సభ్యులు కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, మనీష్ సిసోడియా, కుమార్ విశ్వాస్‌లను వివిధ ప్రాంతాల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు విలేఖర్లతో మాట్లాడుతూ, దేశానికి తీవ్ర నష్టం కలిగించిన బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి కుమ్మక్కయ్యాయని, వీరి నిర్వాకాన్ని ప్రజల ముందు ఉంచాలన్నదే తమ అభిమతమని, ఈ విషయంలో తాము చేయదలుచుకున్నది చేశామని అన్నారు. దేశంలో ప్రతిపక్షమే లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. ఇదిలావుంటే, పోలీసులు తమ ప్రదర్శనలను అడ్డుకోవడంతో ఆగ్రహం చెందిన ఆందోళనకారులు కొన్ని బస్సుల టైర్లకు పంక్చర్లు చేయడం, గాలి తీసేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అక్కడి నుండి కదిలేది లేదని ఆందోళనకారులు భీష్మించడంతో పోలీసులు బలప్రయోగానికి దిగి వారిని దూరంగా తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Grandma gives grandson
Husband kills wife  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles