Tomato festival in spain

Tomato battle in Spain draws the young,gigantic food fight with ripe tomatoes, young people ,popular,Tomatina,

Tomato battle in Spain draws the young

Tomato.gif

Posted: 08/30/2012 11:39 AM IST
Tomato festival in spain

Tomato battle in Spain draws the young

వారికి టమాటాలుంటే చాలు. మైమరచిపోతారు.  ఏడాదికోమారు వాటితోనే పండగ చేసుకుంటారు. టమాటాల్లో మునిగితేలుతూ.. వాటితోనే సరదాగా కొట్టుకుచచ్చిపోతారు. అలా.. టమాటాలతో కొట్టుకుచావడానికి ఏడాదంతా ఎదురుచూస్తారు. బుల్‌ఫైట్‌తో పాటు స్పానిష్‌ జనానికి అత్యంత ఇష్టమైన సమ్మర్‌ ఫెస్టివల్‌ టొమాటో ఫైట్‌. స్పెయిన్‌లో ప్రతి ఏటా జరిగే టమాటో ఫెస్టివల్‌ సరదాగా సాగింది. బ్యూనోల్ నగరంలో వేలాది మంది ఒక్క చోట చేరి టన్నుల కొద్దీ టమాటాలతో యుద్ధం చేశారు. ఒకర్ని ఒకరు టమోటాలతో కొట్టుకున్నారు. ఆనందంలో తేలిపోయారు. ఒకరిపై ఒకరు టమాటాలు విసురుతూ ఆనందించారు. టన్నులకొద్దీ టమాటలు జ్యూస్‌గా మారాయి. స్పానిష్‌ సిటీ బ్యూనోల్  మొత్తం రెడ్‌ పల్ప్‌తో నిండిపోయింది. టమోటినా ఫెస్టివల్‌లో స్పెయిన్‌ ప్రజలు ఉత్సహాంగా పాల్గొన్నారు. ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రజలు దాదాపు అయిదు ట్రక్కుల టమోటాలతో ఆడుకున్నారు. పండగ సందర్భంగా సిటీలోని వీధులన్నీ ఎరుపుగా మారిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 40 వేల మంది ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఇక్కడ జరిగేది ప్రపంచంలోనే అతి పెద్ద టమాటో ఫెస్టివల్‌గా గుర్తింపు పొందింది. ఇందులో పాల్గొనడానికి భారీగా పర్యాటకులు వస్తారు. 1940 నుంచి ఈ ఫెస్టివల్ జరుగుతోంది. మొదట ఓ కూరగాయల మార్కెట్లో స్థానిక యువత ఇలా కొట్టుకోవడంతో అది పండగగా మారిందని చెబుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Barack obama warns residents in isaacs path
Spanish mag pictures michelle obama as a topless  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles