ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 7.6 పాయింట్ల తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఈ ప్రాంత దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అమెరికా భూభౌతిక సర్వే, పసిఫిక్ ప్రాంత సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 47 నిమిషాలకు (భరత కాలమానం ప్రకారం సాయంత్రం 6.17 గంటలకు) సంభవించిన ఈ భూకంపం కేంద్రం తూర్పు తీరంలోని సమర్ రాష్ట్రంలోని గుయివాన్ పట్టణానికి 91 మైళ్ల దూరంలో సముద్రంలో 20 మైళ్ల లోతులో ఉన్నట్లు అమెరికా భూభౌతిక సర్వే తెలియజేసింది. దీంతో ఫిలిప్పీన్స్‌తో పాటు ఈ ప్రాంతంలోని జపాన్, తైవాన్, ఇండోనేసియా, పపువా న్యూ గినియా, అమెరికాకు చెందిన హవాయి దీవితో పాటుగా పసిఫిక్ సముద్రంలోని మిగతా దీవులకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
సునామీ అలలు మొదట ఇండోనేసియాను భారత కాలమానం ప్రకారం రాత్రి 7.05 గంటలకు, ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌ను 7.08 గంటలకు తాకవచ్చని సునామీ హెచ్చరికల కేంద్రం ఒక బులెటిన్‌లో తెలిపింది. మొదట్లో భూకంపం తీవ్రతను 7.9 పాయింట్లుగా పేర్కొన్న అమెరికా భూభౌతిక కేంద్రం ఆ తర్వాత తీవ్రతను 7.6 పాయింట్లకు తగ్గించింది. సునామీ అలలు ఒక మీటరు ఎత్తుకు చేరుకోవచ్చని, ముందుజాగ్రత్త చర్యగా తీరప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి ఎత్తయిన ప్రదేశాలకు తరలిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. అయితే భూకంపం వచ్చిన తర్వాత సునామీ అలలు ఇండోనేసియాలో ఏ ప్రాంతాన్నీ తాకినట్లు తమకు ఇప్పటివరకు వార్తలు రాలేదని ఆ దేశ వాతావరణ ఏజన్సీ టెక్నికల్ చీఫ్ సుహర్జోనో చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more