Three killed in us supermarket shooting

Three killed in US supermarket shooting,Newjersy path market, firing, Terence tyler, US mrines, terrorism, service medal, National service medal, twitter, Gurudwara

Three killed in US supermarket shooting

supermarket.gif

Posted: 09/01/2012 12:05 PM IST
Three killed in us supermarket shooting

Three killed in US supermarket shooting

అమెరికాలో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. సహోద్యోగులపైనే కాల్పులకు తెగబడి ఇద్దరిని బలిగొన్నాడు. ఆపై తనని తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. న్యూజెర్సీలోని ఓల్డ్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఉన్న ‘పాత్‌మార్క్’ సూపర్ మార్కెట్‌లో వేకువజామున 4 గంటల(స్థానిక కాలమానం)కు ఈ మారణకాండ చోటుచేసుకుంది. అమెరికాలో నెలరోజుల వ్యవధిలో ఇది నాలుగో కాల్పుల ఘటన. కాల్పులు జరిపిన వ్యక్తిని 23 ఏళ్ల టెరెన్స్ టైలర్‌గా గుర్తించారు. నౌకాదళ మాజీ సైనికుడైన అతడు గత రెండు వారాలుగా పాత్‌మార్క్ స్టోర్‌లో పనిచేస్తున్నాడు. స్థానిక వార్తా చానళ్లు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... రాత్రి విధుల్లో భాగంగా సూపర్ మార్కెట్లో 12 నుంచి 14 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో టెరెన్స్ కూడా ఉన్నాడు. వేకువజామున 3.30 గంటలప్పుడు అతడు స్టోర్ నుంచి బయటికె ళ్లాడు. అరగంట తర్వాత ఒక హ్యాండ్ గన్, ఓ ఏకే-47 రైఫిల్, తూటాలు పట్టుకుని తిరిగొచ్చాడు.

Three killed in US supermarket shooting

అప్పుడు సిబ్బంది స్టోర్‌ను తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలో తనకు కనిపించిన సిబ్బందిపై టెరెన్స్ విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. మొత్తం 16 రౌండ్లు కాల్పులు జరిపాడు. 18 ఏళ్ల యువతి, 24 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మరణించారు. ఇతర ఉద్యోగులు భయపడి దాక్కున్నారు. ఆ తర్వాత టెరెన్స్ తనని తాను కాల్చుకున్నాడు. తూటాలు తగిలి స్టోర్‌లోని కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. కాల్పులకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, స్టోర్ సిబ్బందిని సమీపంలోని రెస్టారెంట్‌కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brother and sister agriculture
One dead in 76 quake off philippines  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles