Vijaya nagaram railway station

vijaya nagaram Railway station, women, Bengal, Children, romance, Police,

vijaya nagaram Railway station,

vijaya000.gif

Posted: 09/03/2012 11:34 AM IST
Vijaya nagaram railway station

women

కరకు హృదయాలను కూడా కరిగించే ఈ ఉదంతం విజయనగరంలో వెలుగుచూసింది. పట్టణంలో వ్యభిచారం జోరుగా సాగుతోందన్న సమాచారం నేపథ్యంలో రాత్రి నిఘా వేయగా, నడివీధిలో.. తోపుడు బండిపై తన ఇద్దరు పిల్లలకు అన్నం తినిపిస్తూ కనిపించిం దో మహిళ. చింపిరి జుత్తు, నలిగిన దేహంతో ఉన్న ఆమె గురించి అక్కడే ఉన్న రిక్షాపుల్లర్‌ను ఆరా తీయగా.. ఆమె దయనీయగాథ గురించి తెలిపాడు. అతను చెప్పినదాని ప్రకారం.. బెంగాల్‌కు చెందిన ఆ మహిళ, కొద్దిరోజుల కిందట తన ఇద్దరు పిల్లలతో విజయనగరం రైల్వే స్టేషన్‌లో దిగింది. ఊరుగానిఊరు.. భాష తెలీదు! బంధువులు లేరు! నిలువ నీడ లేదు!! దీంతో రైల్వే స్టేషనే వారికి ఆవాసమైంది. ఈ క్రమంలో ఆమెకు ఒక హిజ్రాతో పరిచయమైంది. ఆమె గతమేమిటో తెలియదుగానీ.. హిజ్రాతో పరిచయమైననాటి నుంచి ఆమె పడుపువృత్తితో జీవిస్తోంది! ఆ డబ్బుతోనే పిల్లల ఆకలి తీరుస్తోంది. అయితే, రైల్వేస్టేషన్ వద్ద రాత్రుళ్లు పోలీసుల వేధింపులు ఎక్కువగా ఉండటంతో తన పిల్లలను తీసుకొని వేరేచోటకు మారి అక్కడే తలదాచుకుంటోంది. రోడ్డుపై తమ వ్యాపారాలు ముగించుకొన్న హాకర్లు వదిలివెళ్లిన తోపుడు బండ్లపై తన ఇద్దరు పిల్లలను నిద్రపుచ్చి ఆమె విటులతో వెళ్తుంది. వారిచ్చే సొమ్ముతో ఏ అర్ధరాత్రికో భోజనం పార్శిల్ తెచ్చి పిల్లలను నిద్రలేపి వారికి కడుపు నిండా తినిపిస్తుంది. తాను పిల్లలతో ఉన్నప్పుడు ఎవరైనా విటులు వచ్చి రమ్మంటే వారిని తన భాషలో కసిరిపారేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pak singer hospitalised after police raid her wedding party
Bearded aditya and his hair raising story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles