Cbi court issues summons to dharmana in vanpic case

CBI court issues summons to Dharmana in Vanpic case,dharmana prasada rao, dharmana prasadrao minister, dharmana prasadrao tension, dharmana prasadrao nampally court notice, dharmana prasadrao vanpic issue, dharamana attend nampallycourt 25th

CBI court issues summons to Dharmana in Vanpic case

Dharmana.gif

Posted: 09/14/2012 03:50 PM IST
Cbi court issues summons to dharmana in vanpic case

CBI court issues summons to Dharmana in Vanpic case

మంత్రి ధర్మానకు ఇటీవల రాజీనామా చేసిన .. కాంగ్రెస్ ప్రభుత్వం అతని రాజీనామాను తిరష్కారించింది. వాన్ పిక్ వ్యవహారంలో ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ న్యాయస్థానం నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 25న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. వాన్ పిక్ అక్రమాలపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ ఉత్తర్వులిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ధర్మానతో పాటు మరో 14మందికి కూడా సమన్లు జారీ అయ్యాయి. వీరందరూ 25న సీబీఐ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది.  ధర్మాన ప్రసాదరావుపై సీబీఐ నమోదు చేసిన ఐపీసీ అభియోగాలను మాత్రమే ప్రస్తుతానికి సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ధర్మాన, మోపిదేవీలపై అవినీతి నిరోధక చట్టం నమోదు చేసిన అభియోగాలను కోర్టు పక్కన పెట్టింది.

CBI court issues summons to Dharmana in Vanpic case

వాన్ పిక్ ఛార్జిషీట్ కు సంబంధించి సీసీ 14బై 2012 నెంబర్ ను కేటాయించింది. జగన్  ఆస్తుల కేసులో ఇప్పటి వరకు సీబీఐ నాలుగు ఛార్జిషీట్లను నమోదు చేసింది. అటు ఈ వ్యవహారంలో మొదటి నిందితుడు జగన్, రెండో నిందితుడు విజయసాయిరెడ్డి, మూడో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్. వీరికి నాలుగో, ఐదు నిందితులైన ధర్మాన, మోపిదేవీలతో కలిపి సమన్లు జారీ అయ్యాయి. ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, శ్యాముల్ పై ఐపీసీ అభియోగాలను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. వీరందరిని సీబీఐ న్యాయస్థానం ఈ నెల 25న విచారణ జరపనుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Governor to visit karimnagar
Jagan mohan reddy to be in jail till september 28  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles