డీజీపీ కార్యాలయం ముందు ఓ ఆటో ఆగిపోయింది... అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి మరో ఆటోను పిలిచి తన మూడు ట్రావెల్ బ్యాగ్స్‌ను దానిలో పెడుతున్నాడు... ఈలోపు డీజీపీ కార్యాలయం భద్రతా సిబ్బంది ఆటోలను పక్కకు తీయమన్నారు... దీంతో ట్రావెల్ బ్యాగ్స్ మారుస్తున్న ఆగంతకుడు కంగారుపడ్డాడు... అనుమానించిన సిబ్బంది కాస్త దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించగా బ్యాగ్స్ వదిలి పారిపోయాడు... అర్ధగంట తరవాత స్థానిక పోలీసుల సమక్షంలో వాటిని తెరిచి చూడగా రూ. 6 కోట్ల 70 లక్షలు 50 వేలు కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. ఈ మొత్తాన్ని ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించారు.ఆగంతకుడు ఆగిపోయిన ఆటోలో ఉన్న బ్యాగుల్ని మరో ఆటోలోకి మార్చే ప్రయత్నం ప్రారంభించాడు. ఈ తతంగం జరుగుతున్నది డీజీపీ కార్యాలయం ఎదురుగా కావడంతో అక్కడ సాధారణ దుస్తుల్లో నిఘా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రవీంద్రనాయక్ అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే అధికారులు చూస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఆటో వారిని ఉద్దేశించి ‘ఏయ్ ఎందుకిక్కడ ఆపారు?’ అంటూ గద్దించారు. రవీంద్ర వాటివద్దకు వచ్చేలోపే మూడు బ్యాగులను ఆగిపోయిన ఆటో నుంచి మరోదాన్లోకి మార్చేశారు.అయితే రవీంద్ర ఆటో దగ్గరకు వస్తుండటంతో ఆగంతకుడిలో కంగారు పెరిగి ముఖకవళికలు మారిపోయాయి. దీంతో అనుమానించిన రవీంద్ర ‘ఏమున్నాయ్ బ్యాగుల్లో’ అంటూ గట్టిగా ప్రశ్నించారు. ‘ఈ బ్యాగులు ఎమ్మెల్యే గారివి’ అని చెప్తూ ఆగంతకుడు తడబడ్డాడు. ఈలోపు ఆటోలను సమీపించిన కానిస్టేబుల్ ‘ఏమున్నాయో బ్యాగులు తెరువు’ అంటూ దబాయించారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న ఆగంతకుడు బ్యాగులను, ఆటోను వదిలేసి పారిపోయాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more