చదివింది ఇంటర్... ఎత్తు 3.5 అడుగులు మాత్రమే. కానీ, అందమైన యువకుడి ఫొటోను ఫేస్‌బుక్‌లో ఉంచి అమ్మాయిలతో పరిచయాలు ఏర్పరుచుకొని పెళ్లి పేరుతో మోసగిస్తున్న నిందితుడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లికి చెందిన రాజపతి(31) ఇంటర్ మధ్యలో మానేశాడు. 3.5 అడుగుల ఎత్తున్న రాజపతి గుర్తుతెలియని అందమైన యువకుడి ఫొటోతో అమ్మాయిలకు వల వేసేందుకు ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ తెరిచాడు. ఇతడి బుట్టలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతి పడింది. సోషల్ నెట్‌వర్క్ సైట్లలో పరిచయంతో గుడ్డిగా ప్రేమలోపడి మోసపోతున్న యువతకు ఇదో తాజా ఉదాహరణ, హెచ్చరిక. ఫేస్‌బుక్ మాయాజాలంతో ఓ బీటెక్ విద్యార్థినిని వంచించి రూ.3 లక్షల నగదు, రూ.18 లక్షల విలువచేసే నగలు స్వాహాచేసిన మూడడుగుల యువకుడి ఉదంతమిది.తన పేరుతో ఒక అందమైన యువకుడి ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టి యువతులతో చాటింగ్ ప్రారంభించాడు. గుంటూరుకు చెందిన బీటెక్ చదువుతున్న 22 ఏళ్ల యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆన్‌లైన్‌లో చాటింగ్ ద్వారా ప్రేమ నుంచి పెళ్లి వరకు ఆ యువతిని తెచ్చాడు. అతడి ప్రతిపాదనతో బీటెక్ విద్యార్థిని పెళ్లికి అంగీకరించింది. అప్పుడే అసలు నాటకం మొదలుపెట్టాడు. తనతో పాటు తన చెల్లి పెళ్లి కోసం నాన్న 50 తులాల వరకు బంగారం, రూ.3 లక్షల నగదును దాచినట్లు ఆ యువతి అతనికి తెలిపింది. తనకు కిడ్నీ పాడైందని, ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బుల ఇబ్బంది ఏర్పడిందని ఆమెకు చాటింగ్‌లో తెలిపాడు.
ఆ మాయమాటలను నమ్మిన యువతి పలు దఫాలుగా శ్రీధర్ పేరుతో తనను కలిసిన వ్యక్తికి డబ్బు, నగలను అందజేసింది. తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున శ్రీధర్‌ను పంపుతున్నట్లు చెప్పి ఆమెను నమ్మించాడు రాజపతి. జనవరి నుంచి అక్టోబర్ వరకు మూడు లక్షల రూపాయలు, 50 తులాల బంగారు నగలను ఆమె నుంచి రాజపతి దండుకున్నాడు. అనంతరం ఫేస్‌బుక్‌లో చాటింగ్, ఫోన్‌లో మాట్లాడటం మానేశాడు. దీంతో రాజపతికి ఏమైనా జరిగిందేమోనని ఆందోళనకు గురైన ఆ యువతి తన కుటుంబసభ్యులతో కలిసి గుంటూరుతో పాటు హైదరాబాద్‌లోని ఆసుపత్రులలో గాలించింది. అతడి జాడ తెలియకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. చివరికి తమ కూతురు మోసపోయినట్లు గుర్తించిన బాధిత కుటుంబం లబోదిబోమంది. వారి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 17న కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు జరిపి కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఆధారంగా రాజపతిని బుధవారం అరెస్టుచేశారు. రూ.4.75లక్షలను 17 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయి నుంచి దోచేసిన బంగారాన్ని నిందితుడు సంగారెడ్డిలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువ పెట్టడం వలన స్వాధీనం చేసుకోగలిగారు. కొంత బంగారాన్ని అమ్మి జల్సాల కోసం ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించాడు. బీటెక్ యువతితోపాటు మరో ముగ్గురు యువతులతో కూడా ఇదే తీరులో ప్రేమాయణాన్ని నడిపానని రాజపతి చెప్పడంతో అవాక్కవడం పోలీసుల వంతైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more