Hijras train robbery patna express

hizras, hijras train robbery patna express, hijras, train robbery, patna express, andhra pradesh, gudur railway station, passengers complaint, gudur railway polic

hijras train robbery patna express

hijras.gif

Posted: 11/12/2012 12:44 PM IST
Hijras train robbery patna express

hijras train robbery patna express

రైలులో ప్రయాణిస్తున్న బీహార్ యువకులపై హిజ్రాలు దాడిచేసి లక్ష రూపాయలకు పైగా నగదు దోచుకుని అడ్డుకున్న వారిని చితకబాదిన సంఘటన జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన పలువురు యువకులు ఉపాధి కోసం చెన్నైకి వెళ్లి పనులు చేసుకొని దీపావళి పండుగను పురస్కరించుకుని తమ ప్రాంతానికి వెళ్లేందుకు ఎర్నాకులం - పాట్నా ఎక్స్‌ప్రెస్ రైల్లో బయలుదేరారు. చెన్నై దాటిన తరువాత ఒక స్టేషన్‌లో ఐదుగురు హిజ్రాలు జనరల్ కంపార్టుమెంటులోకి ప్రవేశించారు. మహిళలనుకుని ఆకర్షణకు లోనైన బీహార్ యువకులు వారి వద్దకు వెళ్లడంతో యువకుల వద్ద నున్న నగదును హిజ్రాలు దోచుకున్నారు.

hijras train robbery patna express

కొందరు దీనిని ప్రతిఘటించడంతో వారిపై దాడిచేసి వారివద్దనున్న మొత్తం సొమ్ము దోచుకున్నారు. వీరితో పాటు మరికొంతమంది వద్ద కూడా సొమ్ము లాక్కొన్నారు. స్టేషన్‌కు సమీపించే సమయంలో హిజ్రాలు రైలు దిగి పారిపోయారు. దీంతో పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు గూడూరులో ఆగడంతో ఒక్కసారిగా బీహార్ యువకులు రైలునుండి దిగి ఇంజన్ ముందు ముళ్లకంప వేసి బైఠాయించి తమ వద్ద దోచుకున్న నగదు ఇప్పించాలని ఆందోళనకు దిగారు. దీంతో రైల్వే పోలీసులు రంగప్రవేశం చేసి జరిగిన సంఘటన గురించి బాధితుల నుండి వివరాలు సేకరించారు. తమపై దాడిచేసి నగదు దోచుకున్న హిజ్రాలు గూడూరు సమీపిస్తుండగా రైలు నెమ్మదిగా వెళ్లడంతో దిగి వెళ్లిపోయారని బాధితులు పోలీసులకు తెలిపారు. ఇంకా పలువురి వద్ద హిజ్రాలు బలంవంతంగా నగదు వసూలుచేసి అడ్డుచెప్పిన వారిపై దాడిచేసి నగదు లాక్కొన్నట్టు బాధితులు వాపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fake swami attack by local people
Madhya pradesh cm opposes dominance of english  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles