ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న పలువురి బలహీనత ఆసరా చేసుకుని డబ్బు గుంజేందుకు ఓ మాయ మాంత్రికుని వేసిన ఎత్తుగడ పారలేదు. క్షుద్రపూజలతో నడమంత్రపు సిరికి నడుచుకుంటూ ఇంటికి వస్తుందని నమ్మించి డబ్బు మాత్రం కాజేయడమే కాకుండా గత ఆరుమాసాలుగా రాజభోగాలతో సుఖ సౌక్యాలు అనుభవిస్తున్నాడు. అయితే ఇతగాడి మోసం నుంచి తేరుకున్న బాధితులు ఎట్టకేలకు అతన్ని పోలీసులకు పట్టించారు. పోలీసుల కథనం ప్రకారం... విశాఖపట్నం గురుద్వారాకు చెందిన పైడిపాటి భాస్కర్ (23) అనే యువకుడు పదో తరగతి చదివాడు. అయితే చదువు, సంధ్యా, బాధ్యతలు విస్మరించి చిత్తానుసారం తిరుగుతున్న ఇతగాడికి ఓ చక్కటి ఆలోచన వచ్చింది. ఇంకేముంది తనకు తెలిసిన మంత్రాలతో, పూజలతో గుప్త నిధులను వెలికి తీస్తానని ప్రచారం చేసుకున్నాడు. ఇంకేముంది విశాఖ నుంచి విజయవాడకు మకాం మార్చాడు. ఇదిలావుండగా... పటమటలంక రాఘవనగర్‌కు చెందిన పొన్నం శ్రీనివాసరావు (45) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో అప్పుల నుంచి గట్టేందుకు అనేక మార్గాలు అణ్వేషిస్తున్నాడు. ఈ దశలో తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా క్షుద్ర మాంత్రికుడు భాస్కర్ పరిచయమయ్యాడు.
ఇంకేముంది అతన్ని దర్శిపేటలోని శ్రీరామ్స్ పెరల్ విల్లా అపార్ట్‌మెంటలోని తన ప్లాట్‌లో ఉంచాడు. చల్లపల్లిలో కోట్లరూపాయలు విలువ చేసే గుప్త నిధులు ఉన్నాయని, ఇందుకోసం పూజలు చేయాలని దీంతో ఆ నిధులు హస్తగతమవుతాయని, దీంతో ఆర్థిక కష్టాలు తొలగుతాయని నమ్మించాడు. శ్రీనివాసరావు సహకారంతో అమ్మవారికి శాంతి పూజలు చేయాలని రక్తతర్పణానికి తెర తీశాడు. మేకపోతు తొడ నుంచి తీసిన రక్తంతో క్షుద్రపూజలు నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇందుకోసం అందినంత సొమ్ము అందిపుచ్చుకున్నాడు. శ్రీనివాసరావుతోపాటు ఇదేబాటలో శికుమార్, చిన వెంకటేశ్వరరావు, పెద వెంకటేశ్వరరావు, రెడ్డెమ్మ, ప్రసాద్, రాము అనే మరో పదిమంది వరకు సదరు మాంత్రికుడిని విశ్వసిస్తూ వచ్చారు. వారి వద్దకూడా లక్షల్లో డబ్బు తిన్నట్లు చెబుతున్నారు. అయితే ఆరు మాసాలుగా ఫలితం మాత్రం కానరాకపోవడంతో శ్రీనివాసరావు భార్య శ్రీలక్ష్మీ క్షుద్రమాంత్రికుని మోసాలను బట్టబయలు చేసింది. సమాచారం అందుకున్న పటమట పోలీసులు దర్శిపేటలోని ప్లాట్‌పై ఆదివారం దాడి చేసి మంత్రికుడు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. బాధితుడు శ్రీనివాసరావు భార్య శ్రీలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈమె మోసగానికి రెండు లక్షలు ముట్టచెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more