Bangalore one dead in bank robbery rs 10 lakh stolen

bangalore one dead in bank robbery rs 10 lakh stolen, bangalore, bangalore bank robbery, bank robbery, corporation bank, bank robbery murder

Bangalore One dead in bank robbery Rs 10 lakh stolen

Bangalore.gif

Posted: 11/20/2012 11:18 AM IST
Bangalore one dead in bank robbery rs 10 lakh stolen

Bangalore One dead in bank robbery Rs 10 lakh stolen

పట్టపగలు నగరంలోని ఓ బ్యాంకులో దుండగుడు బీభత్సం సృష్టించాడు. సోలదేవనహళ్లిలోని సప్తగిరి ఆస్పత్రి సమీపంలో ఉన్న కార్పొరేషన్ బ్యాంకులో అతడు జరిపిన కాల్పుల్లో ఓ ఖాతాదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో బ్యాగు తగిలించుకుని ఓ యువ కుడు ఖాతాదారుడిలా బ్యాంకులోకి ప్రవేశించాడు. కాసేపటి తర్వాత రివాల్వర్ తీసి బెదిరించాడు. అక్కడున్న వారి మొబైల్ ఫోన్లు లాక్కున్నాడు. ఒకే ఒక్కడు! ఏడే ఏడు నిమిషాలు! రూ.10 లక్షలు! బ్యాంకును దోచేశాడు! అడ్డొచ్చిన వ్యక్తిని కాల్చి చంపి పరారయ్యాడు. బెంగళూరు శివారులో.. మధ్యాహ్నం మూడు గంటలకు.. సినీ పక్కీలో జరిగిన ఘరానా దోపిడీ ఇది! బెంగళూరు నగర శివారు హెసరఘట్ట మెయిన్ రోడ్డులో మూడంతస్తుల భవంతి ఉంది. అందులో రెండో అంతస్తులో కార్పొరేషన్ బ్యాంకు శాఖ పని చేస్తోంది. 25-30 ఏళ్ల యువకుడు బ్యాంకుకు వచ్చాడు. వచ్చీరాని కన్నడ, హిందీ భాషలు మాట్లాడాడు.

బ్యాంకులో కాసేపు అటూ ఇటూ తిరిగి ఒక్కసారిగా తుపాకీ బయటకు తీశాడు. కదిలితే కాల్చేస్తానంటూ బెదిరించాడు. సిబ్బందిని, ఖాతాదారులను ఒక రూంలో వేసి బంధించాడు. వారి మొబైల్ ఫోన్లు లాక్కున్నాడు. క్యాష్ కౌంటర్‌కు వెళ్లి రూ.10 లక్షల నగదును బ్యాగులో వేసుకున్నాడు. వెళుతూ బ్యాంకు షట్టర్‌ను దించేశాడు. అయితే, అక్కడికి సమీపంలోని పెట్రోలు బంకు యజమాని మురళీధర్ అతడిని చూసి అనుమానించి అడ్డగించాడు. దీంతో, అతడిపై కాల్పులు జరిపి పారిపోయాడు. బుల్లెట్ గాయాలతో నేలకూలిన ఆయన్ను ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ బ్యాంకుకు పెద్దగా సెక్యూరిటీ లేదని బాగా తెలిసిన వారే పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దోపిడీలో మరికొందరు దుండగుడికి సహకరించి ఉండవచ్చని భావిస్తున్నారు. దుండగుడిని గాలించడానికి ప్రత్యేక పోలీసు దళాన్ని రంగంలోకి దించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader payyavula keshav speaks to media
Several feared dead in stampede during chhath puja  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles