Coffee from thai elephant dung costs 2700 per cup

Black Ivory coffee, Thailand using beans digested elephants

the unique coffee, created in Chiang Rai province in northern Thailand, is now the worlds most expensive variety costing $1,100 (£685) per kilogram.

Coffee from Thai elephant dung costs 2700 per cup.png

Posted: 12/08/2012 09:17 AM IST
Coffee from thai elephant dung costs 2700 per cup

Coffee-from-Thai-elephantరోజు ఉదయం లేవగానే చాలా మందికి వేడి వేడి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాస్త సంపన్నులు అయితే రోజుకో రుచిని ఆస్వాదిస్తుంటారు. ఇంకాస్త విలాసవంతమైన వారు చాలా కాస్లీ కాఫీ తాగాలనుకుంటారు. ఎంత కాస్లీ కాఫీ అయినా రేటు ఎంత ఉంటుంది ? మహా అయితే 500 వరకు ఉంటుంది. ఇంత ఎక్కువ ఖరీదు కాఫీ తాగాలని వుంటే మీరు మాల్టీవులకు వెళ్లాల్సిందే. మాల్దీవులలో కానీ అబుదాబీలో దొరికే కాఫీ ధర ప్రపంచంలోనే అత్యంత ఖరీధు అయిందట. అక్కడ స్పెషల్ గా తయారు చేయబడే కాఫీ ధర అక్షరాల 27,00 రూపాయలు. అదేంటి అంత ధర ? అందులో కాఫీ పొడి కాకుండా ఇంకేమైనా కలుపుతారనుకుంటే పొరపాటే. మరి ఏంటి దీని ప్రత్యేకత అనుకుంటున్నారా ? ఇది చాలా వినూత్నమైన రీతిలో తయారైన కాఫీ! దీని తయారీలో ఏనుగులు కూడా పాలుపంచుకున్నాయి !

ఇప్పుడున్న రకరకాల కాఫీలు కాకుండా ఇంకా ఏదైనా కొత్త కాఫీ సృష్టించాలని కెనడాకు చెందిన బ్లేక్ డింకిన్ అనే వ్యక్తి భావించడంతో ఈ బ్లాక్ ఐవరీ కాఫీ తయారైంది. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.1.70 కోట్ల పెట్టుబడి పెట్టారు. తొలుత ముడి కాఫీ కాయలను అరటి, చెరకు తదితర ఆహార పదార్థాలతో కలిపి ఏనుగులకు తినిపిస్తారు. అనంతరం పేడతోపాటు ఏనుగులు విసర్జించిన కాఫీ కాయలను సేకరిస్తారు. వాటిని పగలగొట్టి అందులోని కాఫీ గింజలను బయటకు తీసి వాటిని శుభ్రంగా కడుగుతారు. అంతే, సరికొత్త రుచిగల కాఫీ గింజలు రెడీ. 33 కేజీల ముడి కాఫీ కాయలను ఏనుగుకు తినిపిస్తే చివరకు ఒక కిలో బ్లాక్ ఐవరీ కాఫీ గింజలు మాత్రమే ఉత్పత్తి అవుతాయని బ్లేక్ వివరించారు.  కరి మింగిన కాఫీ గింజల నుంచి తయారైంది కాబట్టే దీని రుచి, సువాసనతోపాటు ధర కూడా ఎక్కువే. మీరు కూడా ఇలాంటి కాఫీ తాగాలంటే అటువెళ్లినప్పుడు ట్రై చేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood actor abhishek arrested in drugs
Tickets prices to touch sky  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles