Tickets prices to touch sky

Ticket prices increased, increase in ticket prices, movie prices hiked, hike of movie tickets, film ticket prices shot, seven member committee on movies, weekend movies, multiplexes in hyderabad

movie ticket prices will hike in 2013.

Tickets prices to touch sky.png

Posted: 12/08/2012 09:10 AM IST
Tickets prices to touch sky

Tickets_pricesవారం అంతా కష్టపడి, వారాంతంలో కాస్త వినోదం కోసం సినిమాకి వెళతాం. కానీ ఇక పై వారంతాల్లో సినిమాకి వెళ్ళే వాళ్ళ జేబులకు భారీగా చిల్లు పడనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తులతో సహా అన్నిరేట్లు పెరిగి సామాన్యుడు విలవిల లాడుతుంటే... ప్రభుత్వం వినోదం పంచే సినిమా థియేటర్ల రేట్లను పెంచేసి వినోదం బదులు దు:ఖాన్ని పంచడానికి రెడీ అయింది. మన రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టిక్కెట్ రేట్లను పెంచేదానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) మిన్నీ మాథ్యూ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు చర్చలు నిర్వహించారు. సినిమా థియేటర్ల టికెట్ల ధ రలు ప్రాంతాలను బట్టి రూ. 15 నుంచి 20 వరకూ పెరగనున్నాయి. ఈ ధరలను ప్రాంతాలను బట్టి వాటిని ఐదు రకాలుగా వర్గీకరించనున్నారు. రాష్ట్ర రాజధాని నగరాన్ని ఒక కేటగిరీగా, మిగిలిన కార్పొరేషన్లను, సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్‌లను, మునిసిపాలిటీలను, పంచాయతీలను మిగతా కేటగిరీలుగా వర్గీకరించనున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఎలాంటి వర్గీకరణ లేకుండా అన్ని సీట్లలోనూ ఒకే టికెట్ ధర ఉన్నందున, థియేటర్‌లో సీట్ల సామర్థ్యం ఆధారంగా ముందు వరుసలోని 20 శాతం సీట్లకు టికెట్ ధరలు తగ్గించే విషయంపైనా చర్చించారు. సినిమా టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక ముందు సినిమాకి వెళ్ళి వినోదం పొందే వారు కాసిన్ని ఎక్కువ డబ్బులు జేబులో పెట్టుకొని వెళ్లండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Coffee from thai elephant dung costs 2700 per cup
Nagam janardhan reddy new demand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles