రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు మాటల దాడి చేశారు. ముఖ్యమంత్రికి భయపడుతున్నాడని, అందువలనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటడం లేదని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారో స్పష్టం చేయాలని గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత నుండి అసెంబ్లీ సమావేశాల చాలా తక్కువగా జరిగినట్లు ఆయన చెబుతున్నారు. గత మూడు సంవత్సరాల నుండి 156 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనికే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ నెల 10నుండి 21 వరకు జరిగే సమావేశాల్లో 11 ప్రధాన అంశాలపై చర్చించాలని తెదేపా శాసన సభా పక్షం నిర్ణయిస్తే సర్కారు సమస్యల నుంచి పారిపోయిందని ఆయన మండిపడ్డారు. స్పీకర్ సైతం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై జరిగిన సమావేశాల అనంతరం సభ తిరిగి 10వ తేదీన ప్రారంభమవుతుందని చెప్పకుండా నిరవధిక వాయిదా వేయటం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని ఆయన దుయ్యబట్టారు. అవిశ్వాసం పెట్టండీ అంటూ పదే పదే డిమాండ్ చేసిన వైకాపా ఇప్పుడు జగన్ కు బెయిల్ వచ్చేవరకూ వద్దని స్పష్టం చేయటం ద్వారా ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టాడని సీఎం ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదని గాలి ముద్దు క్రిష్ణమ నాయకుడు అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more