Delhi gang rape sonia writes to shinde dikshit

delhi gang-rape, delhi student raped, rape in a bus, sonia gandhi, delhi chief minister sheila dikshit, home minister sushil kumar shinde, congress president sonia gandhi, delhi hospital

delhi gang rape: sonia writes to shinde, dikshit

sonia.gif

Posted: 12/19/2012 12:25 PM IST
Delhi gang rape sonia writes to shinde dikshit

delhi gang rape: sonia writes to shinde, dikshit

ఢిల్లీలో  ఆదివారం 16తేది రాత్రి 9.30 గంటలకు  ఒక వైద్య విద్యార్థిని పై  ఢిల్లీ నడివీధుల్లో  బస్సులో ప్రయాణిస్తు  గ్యాంగు రేప్  జరిగిన  సంఘటనతో  దేశమంత మహిళ సంఘాలు నిరసనలు తెలుపుతున్నారు.  ఈ విషయం తెలుసుకున్న  కాంగ్రెస్ అద్యక్షురాలు  సోనియా గాంధీ  తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.  వెంటనే  వైద్య విద్యార్థిపై జరిగిన  సామూహిక  అత్యాచార  ఘటనపై   సోనియా  సీరియస్  స్పందించారు.   ఈ ఘటనపై  కేంద్ర హోంశాఖ మంత్రి  సుశీల్  కుమార్ షిండే , ఢీల్లీ  ముఖ్యమంత్రి  షిలా దీక్షిత్ లకు లేఖ రాశారు.  ఈ చర్యకు పాల్పడిన  నిందితులను  కఠినంగా శిక్షించాలని  సోనియా గాంధీ కోరారు.   మహిళల రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు  తీసుకోవాలని  కేంద్ర హోంశాఖ మంత్రికి సూచించారు.   ఇలాంటి  ఘటనలు  మళ్లీ జరగుకుండా   ఉండేవిధంగా కఠినంగా  వ్యవహరించాలని లేఖలో పేర్కొన్నారు.  సోనియాగాంధీ  బస్సులో  రేప్ గురైన  విద్యార్థి ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న అమ్మాయిని పరామర్శించారు.   అమ్మాయి  ఆరోగ్య  స్థితిగతుల  గురించి  వైద్యులను  అడిగి తెలుసుకున్నారు. సోనియా లేఖతో  కేంద్రహోంశాఖ వెంటనే కదిలింది.  ఈ సంఘటన పై  పోలీసులు ఉన్నతాధికారులతో  భేటి కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా  ఢిల్లీ ముఖ్యమంత్రి షిలా దీక్షిత్ కూడా  ఈ ఘటనను సీరియస్ తీసుకోవటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.  మహిళ సంఘాలు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి  షీలా దీక్షిత్ పై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది.  ఈ ఘటన పై కేంద్ర హోంశాఖ ఎలాంటి నిర్ణణం తీసుకుంటుందో చూడాలి? మహిళలకు రక్షణ ఎలా కల్పించాస్తారో ? ఇలాంటి  సంఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలని మహిళ సంఘాలు ఎదురుచూస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles