Maha kumbhamela holi dips

maha kumbhamela, mouni amavasya, triveni sangam, hamsala deevi

maha kumbhamela holi dips

kumbhamela.png

Posted: 02/25/2013 03:20 PM IST
Maha kumbhamela holi dips

ఈ రోజు మాఘ పౌర్ణమి మహా కుంభమేలా సందర్భంగా దేశం నలుమూలల నుంచీ వచ్చిన భక్తులు అహ్మదాబాద్ త్రివేణీ సంగమంలో స్నానాలు చేసారు.  సుమారు కోటి మంది వరకూ వస్తారని అంచనా వేసుకున్న అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లను ముందుగానే చేసారు.   ముఖ్యంగా మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని, అటువంటిది పునరావృతం కాకూడదనే ఉద్దేశ్యంతో విశేష ఏర్పాట్లను చేసారు. 

ఈరోజు కృష్ణా జిల్లా హంసలదీవిలో సముద్ర స్నానాలకు వచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది.   నిన్న అర్థరాత్రి వైభవంగా జరిగిన వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవాన్ని తిలకించి, ఉదయాన్నే సూర్యోదయ వేళలో సూర్యనమస్కారాలు చేసి సముద్ర స్నానం చేసారు.  కృష్ణానది సముద్రంలో కలిసే చోట స్నానం కోసం వచ్చే వారి భద్రత కోసం ఏర్పాట్లు చేసి కూడా భక్తులను అనుమతించకపోవటంతో ఎక్కడెక్కడినుండో వచ్చిన భక్తులు నిరాశ చెందారు.  సముద్ర స్నానానికి వచ్చిన రాష్ట్ర అధికార భాషా సంఘ అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ రెండు గంటలపాటు నిలిచిపోయిన ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు.  తర్వాత అవనిగడ్డ ఎస్సై చాముండేశ్వరి పూనుకుని ట్రాఫిక్ ని తొలగించి రాకపోకలను నియంత్రించటంతో ఆయన సముద్ర స్నానం అనంతరం వేణు గోపాల స్వామి దర్శనం చేసుకున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balwant singh rajona rejects to go for mercy petition
Botsa satyanarayanapng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles