Bomb scare at hyderabad mgbs

bomb scare, bomb blast, mgbs hyderabad

bomb scare at hyderabad mgbs

bomb-fear.png

Posted: 03/01/2013 05:54 PM IST
Bomb scare at hyderabad mgbs

నిత్యం రద్దీగా ఉండే హైద్రాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎమ్ జి బి ఎస్) లో బాంబులు పెట్టారన్న వార్త పోలీసులను కలవరపెట్టింది. ప్రయాణీకులనందరినీ భయభ్రాంతులకు గురిచేసింది,  బాంబు స్క్వాడ్ జాగిలాలతోహుటాహుటిన వెళ్ళి బస్ స్టేషన్ లో అడుగడుగూ తనిఖీ చేసింది.  అఫ్జల్ గంజ్ పోలీసులకు ఎవరిదీ కాని సంచీ దొరికి అందులో జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి.  పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలియజేసారు. 

అన్ని ప్రదేశాలకు వెళ్ళే బస్సులూ  బయలుదేరేది ఎమ్ జి బి ఎస్ నుంచే కావటం తో అధిక సంఖ్యలో ఉండే ప్రయాణీకులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.  వారాంతం కూడా కావటంతో శని, ఆదివారాలలో ప్రయాణం చేసేవారు కూడా ఎక్కువ మంది ఉంటారు.  ఈ మధ్యనే జరిగిన బాంబు పేలుళ్ళ నేపథ్యంలో అందరూ ఆందోళనకు గురయ్యారు.

ఉదయం హైద్రాబాద్ జీడిమెట్ల ప్రాంతంలోని సుభాష్ నగర్ లో చెత్త కుండీలో పేలుడు పదార్థం పేలి, అందులో చెత్త ఏరుకుంటున్న బాలుడు గాయపడ్డాడు.  అతన్ని సమీపంలోని హాస్పిటల్ కి తరలంచి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  పేలింది ఏమిటన్నది ఇంకా తెలియలేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Full protection for second test at uppal stadium
Space based solar power costly and risky  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles