Full protection for second test at uppal stadium

india australia second test match, cricket team, hyderabad uppal stadium, cyberabad police

full protection for second test at uppal stadium

uppal-stadium.png

Posted: 03/02/2013 08:54 AM IST
Full protection for second test at uppal stadium

police-protection

ఈ రోజు హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియాల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో నిన్నటి నుంచే పోలీసు బలగాలు స్టేడియం నంతా తమ స్వాధీనంలోకి తీసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.  ఈ మధ్యనే దిల్ సుఖ్ నగర్ లో జరిగిన పేలుళ్ళ దృష్ట్యా, భద్రతా ఏర్పాట్లను నియంత్రిస్తున్న సైబరాబాద్ పోలీసులు, మొత్తం 2000 మంది పోలీసు సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనా జరగకుండా ఉండటం కోసం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  సిబ్బందికి తోడుగా, ఉప్పల్ స్టేడియం పరిసరాలను గమనిస్తూ ఉండటం కోసం 60 సిసి కేమెరాలతో భద్రతా పర్యవేక్షణకు రంగం సిద్ధం చేసుకున్నారు.  తనిఖీలు నిర్వహించే సిబ్బంది ఎప్పటి కప్పుడు ఇతర అధికారులతో సంభాషించగలిగే విధంగా ఏర్పాట్లు జరిగాయి. 

అంతా బాగానే ఉంది కానీ ఒక్క విషయం పోలీసులను కలవరపెడుతోంది.  అవేమిటంటే గుర్తింపు కార్డులు.

మీడియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారికి, ఇతర పనుల కోసం వచ్చేవారికి, ఎడా పెడా గుర్తింపు కార్డులు జారీ చెయ్యటం పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది.  సాధారణంగా గుర్తింపు కార్డుల విషయంలో పోలీసులు చాలా జాగ్రత్త తీసుకుంటారు.  దరఖాస్తు పెట్టుకున్న వారి గురించి పోలీసులు, ఇతర విభాగాల అధికారులు విచారణ జరుపుతారు.  దరఖాస్తులతో వారి మీడియా గుర్తింపు కార్డుల ఫోటో కాపీ ని జతపరచటం విధిగా చెయ్యాలి కానీ, అలాంటిది లని సందర్భాల్లో కూడా వారికి స్టేడియంలోకి అనుమతులు లభించాయి.  గుర్తింపు లేని పత్రిక పేర్లతో కూడా అనుమతులు తీసుకున్నారేమోనన్న అనుమానం పోలీసులను పీడిస్తోంది.  ఇదంతా హెసిఏ వత్తిడి వలన ఆదరాబాదరాగా జరిగిందని అంటున్నారు.  స్టేడియంలో ప్రవేశించటానికి అవసరమైన గుర్తింపు కార్డులను జారీ చేసే ముందు హెసిఏ దరఖాస్తుదారుల పూర్తి వివరాలను ముందుగానే ఇవ్వాలి కానీ ఈ సారి అలా చెయ్యకపోవటంతో విచారణ జరపటానికి సమయం లేకుండా పోయిందట. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Center for out of court settlements to be opened today
Bomb scare at hyderabad mgbs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles