Center for out of court settlements to be opened today

hyderabad civil courts, out of court settlements, pending court cases

center for out of court settlements to be opened today at hyderabad civil courts

out-of-court.png

Posted: 03/02/2013 09:30 AM IST
Center for out of court settlements to be opened today

courts

పూర్వకాలం న్యాయ విచారణలు చకచకా జరిగిపోయేవి.  అందుకు కారణం ముందు గ్రామ పెద్దలు, వారి వల్ల కాకపోతే రాజ్యాన్ని ఏలే రాజు దగ్గర విచారణలు జరిగేవి.  అయితే, అందులో ఉన్న లోపాలను సరిచెయ్యటానికి వచ్చిందే న్యాయ వ్యవస్థ.  ఏలికలకు, పాలకులకు, నాయకులకు సంబంధం లేకుండా ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థగా న్యాయ విచారణను చేపట్టి, వెయ్యి మంది నేరస్తులు తప్పించుకున్నా పరవాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడగూడదనే ఉద్దేశ్యంతో చేసిన సుదీర్ఘ న్యాయ విచారణా ప్రక్రియను వేగవంతం చెయ్యటం సాధ్యం కాని పని.  అందుకే లక్షలాది కేసులు న్యాయస్థానాలలోని దస్త్రాలలో న్యాయ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ మూలుగుతున్నాయి. 

రాజుల కాలం అంతరించిపోయిన తర్వాత కూడా న్యాయస్థానలకు పోకుండా గ్రామాలలో, పట్టణాలలో ఉన్న నాయకులను, పేరు మోసిన న్యాయవాదులను ఆశ్రయించేవారు.  ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ పద్ధతి నడుస్తోంది.  ఇరు పక్షాలనూ కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించాలంటే వాటిని నిర్వహించేవారికి మాటలలో నైపుణ్యం, చక్కని అవగాహన, వారికి సమాజంలో గౌరవమో భయమో భక్తో ఉండాలి.  కానీ ఎంతైనా ఒక మనిషి న్యాయ నిర్ణయం చేసేటప్పుడు అతని ఇష్టాయిష్టాలు, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతాలు లేకుండా ఉండవు.  తన పలుకుబడితో అప్పటికప్పుడు వాద ప్రతివాదులను సమాధానపరచినా, మరోసారి ఆ గొడవ తలెత్తవచ్చు. 

ఈ దిశగా న్యాయవ్యవస్థ ఆలోచించి, న్యాయస్థానాలకు ఆవలే (ఔట్ ఆఫ్ కోర్టు) పరిష్కారాల కోసం పాటుపడటం ముదావహం. 

ఈ రోజు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమన్ కబీర్ చేతుల మీదుగా హైద్రాబాద్ లోని సివిల్ కోర్టు ఆవరణలో న్యాయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు.  ఈ కేంద్రం ద్వారా వివాదాలకు పరిష్కారాలను పొందదలచుకున్నవారికి ఇందులో న్యాయ సేవలు లభిస్తాయి.  ఈ రోజు ఈ కేంద్ర ప్రారంభోత్సవంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇంకా ఇతర న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, మంత్రి ప్రతాపరెడ్డి పాల్గొంటారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women jac formed for telangana cause
Full protection for second test at uppal stadium  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles